»   » దీపిక పదుకొనె, రణవీర్, భన్సాలీలపై ఎఫ్ఐఆర్ నమోదు

దీపిక పదుకొనె, రణవీర్, భన్సాలీలపై ఎఫ్ఐఆర్ నమోదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె, నటుడు రణవీర్ సింగ్, దర్శకుడు సంజయ్ లాలా భన్సాలీ, మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. 'రామ్ లీలా' చిత్రం ద్వారా వీరు కొన్ని వర్గాల మనో భావాలను దెబ్బతీస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో వారిపై ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది.

Sanjay Leela Bhansali, actor Ranveer Singh, actress Deepika Padukone

పవన్ శర్మ అనే న్యాయవాది అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో 'రామ్ లీలా' సినిమాకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసారు. 'నవంబర్ 15న విడుదలకు సిద్దంగా ఉన్న ఈచిత్రం యొక్క ఇటీవల విడుదలైన ప్రోమోలోని సన్నివేశాలు వివిధ వర్గాల మధ్య శతృత్వం పెంచే విధంగా ఉన్నాయని' పవన్ శర్మ ఆరోపించారు.

పవన్ శర్మ ఫిర్యాదును స్వీకరించిన కోర్టు దీనిపై విచారణ జరుపాలని పోలీసులు ఆదేశించింది. బాలీవుడ్ హాట్ హీరోయిన్ దీపిక పదుకొనె, యంగ్ హీరో రణవీర్ సింగ్ జంటగా సంజయ్ లీలా భన్సాలీ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రామ్ లీలా'. ఇటీవల విడుదలైన ఈచిత్రం ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. నవంబర్ 15న సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

English summary
A court here Saturday told police to register a case against Bollywood director Sanjay Leela Bhansali, actor Ranveer Singh, actress Deepika Padukone and others for allegedly hurting religious sentiments of people in their upcoming movie Ram Leela, a lawyer said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu