»   » 'కబాలి' థియేటర్‌లో మంటలు,మొత్తం కాలిపోయింది

'కబాలి' థియేటర్‌లో మంటలు,మొత్తం కాలిపోయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

దాచెపల్లి(గుంటూరు): రజనీకాంత్ తాజా చిత్రం కబాలి ప్రదర్శసిస్తున్న ధియేటర్ మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లా దాచేపల్లిలో జరిగింది. అక్కడ కబాలి చిత్రం ప్రదర్శింపబడుతున్న అలంకార్ థియేటర్‌లో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది.

షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి సీట్లతో సహా థియేటర్ పూర్తిగా కాలిపోయింది. థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న కబాలి చిత్రాన్ని మ్యాట్నీ షో చూడటానికి వచ్చిన ప్రేక్షకులు మంటలు ఎగిసిపడటంతో.. భయంతో పరుగులు తీశారు.


Fire in cinema hall, short circuit blamed

ఏసీ నుంచి మంటలు వచ్చినట్లు కొంతమంది ప్రేక్షకులు తెలిపారు. థియేటర్‌లోని స్పాంజ్‌లతో కూడిన చెక్క కుర్చీలకు మంటలు అంటుకుని వేగంగా వ్యాపించాయి. అగ్నికిలలు ఎగిసిపడుతుండడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి.


సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్డంది మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. షార్ట్స్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇటివలే రూ. రెండు కోట్లతో థియేటర్ ఆధునీకరించినట్లు మేనేజర్ తెలిపారు.

English summary
Fire broke out at Alankar Theatre at Guntur today. On receiving information, Fire Officers rushed to the spot along with their staff and put out the flames. No one was injured in the mishap.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu