»   » మత్తెక్కించే సెక్సీ పోస్టర్లు, బ్రహ్మానందం కూడా...(ఫోటోలు)

మత్తెక్కించే సెక్సీ పోస్టర్లు, బ్రహ్మానందం కూడా...(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా విడుదలకు ముందు పబ్లిసిటీ బాగా జరిగితేనే ఓపెనింగ్ కలెక్షన్లు బాగా వస్తాయి, పెట్టుబడిలో సగానికిపైగా రాబట్టొచ్చు అనేది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అనుసరిస్తున్న బిజినెస్ మంత్రం. పెద్ద సినిమాలైనా, చిన్న సినిమాలైనా విడుదలకు ముందే పోస్టర్లు, ట్రైలర్లు, ఆడియో లాంటి వాటితో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెరిగేలా చేయడం ఎంతో ప్రధానమైన అంశంగా మారింది.

అయితే కొన్ని చిన్న సినిమాల విషయంలో మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. ఇలాంటి వారు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి తమ సినిమాల్లో బ్రహ్మానందం, వేణు మాధవ్ లాంటి పాపులర్ కమెడియన్లు తీసుకోవడం, సినిమా పోస్టర్లు హాట్ అండ్ సెక్సీగా డిజైన్ చేయించి వేడి పుట్టేలా చేయడం లాంటివి చేస్తున్నారు.

ఇపుడు ఇలాంటి అంశాలను అనుసరిస్తూ వస్తున్న చిత్రం 'ఫైర్'. మరి ఆ సినిమా విశేషాలు ఏమిటో స్లైడ్ షోలో చూద్దాం...

ఫైర్

ఫైర్

రిషి, బషీద్ హీరోలుగా, నమిత, ‘ప్రేమిస్తే' సంధ్య, భానుమెహ్ర, రేఖ నాయికలుగా రూపొందుతున్న చిత్రం ‘ఫైర్'.

బషీద్ స్వీయ దర్శకత్వం

బషీద్ స్వీయ దర్శకత్వం

బషీద్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది.

ఆడియో రిలీజైంది

ఆడియో రిలీజైంది

ఈ చిత్రంలోని పాటలు ఏప్రిల్ 28న మధురా ఆడియో ద్వారా మార్కెట్​లోకి విడుదలయ్యాయి.

మాస్ ఎంటర్టెనర్

మాస్ ఎంటర్టెనర్

నిర్మాత బషీద్ మాట్లాడుతూ... ‘ఇదొక మాస్ యాక్షన్ ఎంటర్​టైనర్. ముక్కోణపు ప్రేమకథకు అన్ని కమర్షియల్ అంశాలు జోడించి రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.

గబ్బర్ సింగ్ గెటప్‌‌లో బ్రహ్మానందం

గబ్బర్ సింగ్ గెటప్‌‌లో బ్రహ్మానందం

ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం గబ్బర్ సింగ్ గెటప్‌లో కనిపించనున్నారు.

వేణు మాధవ్

వేణు మాధవ్

మరో స్టార్ కమెడియన్ వేణు మాధవ్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు.

నిర్మాణ సంస్థ

నిర్మాణ సంస్థ

ఎస్.బి.కె. ఫిలిమ్స్ కార్పొరేషన్ పతాకంపై ఎస్.కె.బషీద్ దర్శకత్వంలో ఎస్.కె.కరీమున్నీసా ఫైర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చాలా రోజుల తర్వాత నమిత

చాలా రోజుల తర్వాత నమిత

భారీ అందాల నమిత చాలా రోజుల తర్వాత తెలుగులో నటిస్తున్న చిత్రం ‘ఫైర్'. ఆమెను చూసేందుకైనా అభిమానులు ఈ సినిమాపై ఆసక్తి చూపుతున్నారు.

ఆ అంశాలు హైలెట్

ఆ అంశాలు హైలెట్

నమిత, రేఖ అందచందాలుతో పాటు బ్రహ్మానందం, వేణుమాదం పంచే వినోదం సినిమాకు హైలెట్‌గా ఉంటాయని నిర్మాత తెలిపారు

విదేశాల్లో షూటింగ్

విదేశాల్లో షూటింగ్

ఆస్ట్రేలియా, బ్యాంకాక్, హాంకాంగ్​లో చిత్రీకరించిన పాటలు, సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని నిర్మాత తెలిపారు.

విడుదల తేదీ

విడుదల తేదీ

మే 25న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు

నటీనటులు

ఎమ్మెస్ నారాయణ, దువ్వాసి మోహన్, నల్లవేణు, వేణుమాధవ్, తెలంగాణా శకుంతల తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతిక విభాగం

సాంకేతిక విభాగం

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.ఎస్. సెల్వరాజ్, మధు ఎ. నాయుడు, కళ: బాబా, ఫైట్స్: దళపతి దినేశ్, డిఫరెంట్ డానీ, సమర్పణ: మాస్టర్ ఎస్‌కె. అబ్దుల్లా, నిర్మాత: ఎస్‌కె. కరీమున్నీసా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్‌కె. బషీద్.

English summary
Fire movie hot stills released. Directed by Basheed SK and Starring Namitha, Rishi, Sandhya, Monica, Music by M M Sreelekha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu