»   » ఫస్ట్ కాపీ ఔట్: ‘జనతా గ్యారేజ్’ టాక్ ఎలా ఉందంటే?

ఫస్ట్ కాపీ ఔట్: ‘జనతా గ్యారేజ్’ టాక్ ఎలా ఉందంటే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' చిత్రం సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదల ముందు డిస్ట్రిబ్యూటర్లకు సినిమాను చూపించడం అనే ఆనవాయితీ ఎప్పటి నుండో ఉంది. తాజాగా జనతా గ్యారేజ్ చిత్రాన్ని యూకే, యూఏఈ లో డిస్ట్రిబ్యూటర్ల కోసం ప్రదర్శించినట్లు తెలుస్తోంంది.

కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాను భారీ రేటుకు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు కాస్త టెన్షన్ గానే ఉన్నారు. వారిలో టెన్షన్ పోగొట్టేందుకే వారికోసం ప్రత్యేకంగా షో వేసారట.


సినిమా చూసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లు చాలా హ్యాపీగా ఫీలయ్యారని, సినిమాకు పెట్టిన పెట్టుబడి తిరిగొస్తుందనే నమ్మకం వారిలో ఏర్పడిందని అంటున్నారు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించడం ఖాయం టాక్ వినిపిస్తోంది.


సినిమాలో యాక్షన్, లవ్, ఫ్యామిలీ మెచ్చే అంశాలు అన్నీ బాగా కుదిరాయని.....మాస్, క్లాస్, యూత్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ దర్శకుడు కొరటాల శివ అందించిన కథ, కథనం సినిమాకు హైలెట్ అవుతుందని అంటున్నారు.


జనతా గ్యారేజ్

జనతా గ్యారేజ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించిన భారీ చిత్రం 'జనతా గ్యారేజ్' . ఎన్టీఆర్ సరసన సమాంతా, నిత్యా మీనన్ లు కథానాయికలు గా కనిపిస్తారు.


మోహన్ లాల్

మోహన్ లాల్

ప్రఖ్యాత మళయాళం నటుడు మోహన్ లాల్ ఈ చిత్రం లో ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. సినిమాలో ఎన్టీఆర్ తర్వాత ఆయన పాత్ర హైలెట్ కాబోతోంది. ఇటీవలే షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకున్న జనతా గ్యారేజ్ ప్రపంచవ్యాప్తం గా సెప్టెంబర్ 1 న భారీ స్థాయి లో విడుదల అవుతుంది అని చిత్ర బృందం తెలిపింది.


దేవిశ్రీ

దేవిశ్రీ

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం ఆడియో ఇటీవల రిలీజై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.


కొరటాల శివ ఏమంటున్నారు?

కొరటాల శివ ఏమంటున్నారు?

"జనతా గ్యారేజ్ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది అన్న నమ్మకం ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో ఉన్న నటుడికి, అయన మాస్ ఇమేజ్ కి సరిపడే కథ ఇది. చాలా పెద్ద స్పాన్ ఉన్న ఒక హైలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఈ చిత్రం'అని తెలిపారు.


నిర్మాతలు

నిర్మాతలు

" యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకం గా నిర్మించాం . భారీ తారాగణం తో, మంచి పవర్ఫుల్ సబ్జెక్టు తో దర్శకులు కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సెప్టెంబర్ 1 న భారీ స్థాయి లో ప్రపంచవ్యాప్తం గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. మా బ్యానర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ గా నిలుస్తుంది అని అనుకుంటున్నాం" అని తెలిపారు.


ముఖ్య పాత్రల్లో

ముఖ్య పాత్రల్లో

సాయి కుమార్, ఉన్ని ముకుందన్, అజయ్, బ్రహ్మాజీ, బెనర్జీ , జాన్ ,సితార, దేవయాని వంటి ప్రఖ్యాత నటులు ఈ చిత్రం లో ముఖ్య పత్రాలను పోషిస్తున్నారు.


తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి - తిరు . ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావు . ఆర్ట్ - ఎ. ఎస్. ప్రకాష్. ఫైట్స్ - ఆణల్ అరసు. సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ . ఎక్సిక్యుటివ్ ప్రొడ్యూసర్ - చంద్రశేఖర్ రావిపాటి . నిర్మాతలు - నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ (C. V. M.) రచన - దర్శకత్వం - కొరటాల శివ.


గ్రాండ్ రిలీజ్

గ్రాండ్ రిలీజ్

ఎన్టీఆర్ కెరీర్లోనే తొలి సారిగా ఈ సినిమాను అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.


ఓపెనింగ్స్

ఓపెనింగ్స్

సినిమాపై అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో కనీసం రూ. 15 కోట్ల ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.


ఆల్ ది బెస్ట్

ఆల్ ది బెస్ట్

జనతా గ్యారేజ్ టీంకు వన్ ఇండియా ఫిల్మీబీట్ తరుపున ఆల్ ది బెస్ట్.


English summary
"Exclusive ! First Censor Copy of #JanathaGarage is OUT! BLOCKBUSTER Response by all over ! #JrNTR Bestest Work ever." Umair Sandhu said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu