»   » స్టైలిష్ గా 'స్పీడున్నోడు'... ఫస్ట్ లుక్ ఇదిగో

స్టైలిష్ గా 'స్పీడున్నోడు'... ఫస్ట్ లుక్ ఇదిగో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అల్లుడు శీను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌. ఆ సినిమా సక్సెస్ అయినా కొంతకాలం సైలెంట్ గా ఉండి సీనియర్ దర్సకుడు తో సినిమా మొదలెట్టాడు. శ్రీనివాస్ నటిస్తున్న కొత్త చిత్రం స్పీడున్నోడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ ఆదివారం చిత్రం టీజర్‌ను విడుదల చేయనున్నట్లు హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పేర్కొన్నారు. భీమనేని శ్రీనివాస్‌రావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గుడ్‌విల్‌ సినిమా బ్యానర్‌పై భీమనేని సునీత నిర్మిస్తున్నారు.

First look of Bellamkonda Srinivas in Speedunnodu

బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ....‘అల్లుడుశీను' హీరోగా మంచి లాంచ్‌గా భావిస్తున్నాను. ఆ సినిమాతో అన్ని రకాలుగా మంచి మార్కులే పడ్డాయి. ‘స్పీడున్నోడు' నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రం. తమిళ, కన్నడ భాషల్లో హిట్టైన ‘సుందర్‌ పాండియన్'కు రీమేకిది. చివరి అరగంట మినహా మిగిలిన కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పు చేశాం.

‘స్నేహం, ప్రేమ, కుటుంబ అనుబంధాలతో ముడిపడిన ఓ యువకుడికి ఓ సమస్య ఎదురైతే దాని నుంచి ఎలా బయటపడ్డాడు అనేది చిత్ర కథ. చూసి మరచిపోయే సినిమా కాదిది. ఇంటికెళ్లినా గుర్తొస్తూనే ఉంటుంది. కథకు తగ్గట్టు దర్శకుడే టైటిల్‌ ఎంపిక చేశారు. ఈ సినిమా కోసం ‘అల్లుడుశీను' కన్నా పది రెట్లు కష్టపడ్డా. నటుడిగా నిరూపించుకోవడానికి నాకు దొరికిన మంచి అవకాశమిది. ప్రతి సినిమాకు కొత్తగా కనిపించాలనుకుంటున్నా. ఇందులో కాస్త డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తా'' అని తెలిపారు.

English summary
Bellamkonda Srinivas, has now come back with his next movie Speedunnodu. The first look poster of Speedunnodu has released .
Please Wait while comments are loading...