అల్లు అర్జున్ ధమాకా.. ‘డీజే’ కౌంట్ డౌన్ స్టార్ట్స్.. రెండురోజుల్లో..
సరైనోడు చిత్ర ఘనవిజయం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథంగా అవతారమెత్తాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫిబ్రవరి 18న విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.
సరైనోడు చిత్ర ఘనవిజయం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథంగా అవతారమెత్తాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫిబ్రవరి 18న విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా, సెన్సెషనల్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

'ఫిబ్రవరి 18న ఫస్ట్ లుక్ కోసం కౌంట్ డౌన్ మొదలైంది. అందుకోసం ఈ రోజు ఉదయం 7.39 నిమిషాలకు మీకు కొత్త విషయాన్ని చూపించనున్నాం' అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. దువ్వాడ జగన్నాథం చిత్రానికి సంబంధించిన పోస్టర్ చాలా ఇంట్రస్టింగ్ రూపొందించారు. ఈ నేపథ్యంలో ఫస్ట్‌లుక్‌పై మరింత ఆసక్తి నెలకొన్నది.

allu arjun dil raju harish shankar duvvada jagannadham first look అల్లు అర్జున్ దిల్ రాజు హరీశ్ శంకర్ దువ్వాడ జగన్నాథం ఫస్ట్‌లుక్


Click it and Unblock the Notifications