»   »  పోస్టర్ అదిరింది :నిఖిల్ ‘శంకరాభరణం’ ఫస్ట్‌లుక్

పోస్టర్ అదిరింది :నిఖిల్ ‘శంకరాభరణం’ ఫస్ట్‌లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :‘‘స్వామిరారా, కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్య'' చిత్రాలతో తనకంటూ విభిన్నమైన శైలిని ఏర్పాటు చేసుకుని దూసుకుపోతున్న నిఖిల్ రచయిత కోనవెంకట్ నిర్మాణంలో ‘శంకరాభరణం' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ఉద‌య్ నంద‌న‌వ‌నం ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఈ రోజు కోన వెంకట్ తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా విడుదల చేసారు. మీరు ఓ లుక్కేయండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

‘శంకరాభరణం' అనే లోగో, హీరో హీరోయిన్లు నిఖిల్, నందితలు పరిగెడుతుంటే వెనక కొంతమంది రౌడీలు వెంటపడడం.. ఇలా పోస్టర్‌తోనే హైప్ క్రియేట్ చేసారు.

బీహార్ నేపథ్యంలో సాగే మరో సరికొత్త క్రైం కామెడీ సినిమా ఇది. ఈ సినిమాకు ‘శంకరాభరణం' అనే టైటిల్ పెట్టిన రోజునుంచే అంతటా మంచి ఆసక్తి రేకెత్తింది. తెలుగులో స్టార్ రైటర్‌గా వెలుగొందుతున్న కోన వెంకట్ ఈ సినిమాకు స్క్రిప్ట్ సమకూర్చడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరించడంతో సెట్స్‌పైకి వెళ్ళకముందే ఈ కాంబినేషన్‌పై అంచనాలు ఏర్పడ్డాయి.

First Look: Nikhil's Shankara Bharanam!

గత కొద్దిరోజులుగా జరుగుతున్న స్క్రిప్ట్‌ పనులను పూర్తి చేసిన శంకరాభరణం టీమ్ ఈ రోజే షూటింగ్ మొదలుపెట్టింది. నార్త్ ఇండియాలోని సినిమా కథకు సరిపోయే పలు లొకేషన్లను ఈ మధ్యే ఎంపిక చేశారు. ఇక ఈ ఉదయం నుంచే షూటింగ్ మొదలైంది. ఉదయం మొదటి షాట్ ఓకే అయిన వెంటనే సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

క్రైమ్ కామెడీ క‌థ‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన నందిత‌ను హీరోయిన్‌గా ఖరారు చేసినట్లు కోనవెంకట్ ప్రకటించారు. అలాగే ఈ సినిమాలో అతిధి పాత్రలో తెలుగమ్మాయి అంజలి నటిస్తోందని కోన తెలిపారు. అంజలికి ‘గీతాంజలి' చిత్రంతో కోన మంచి విజయాన్ని అందించారు. ఆ మేరకే అంజలి ‘శంకరాభరణం' చిత్రంలో గెస్ట్ రోల్ వేయడానికి సిద్థపడిందని సమాచారం.

English summary
Kona Venkat shared First Look of 'Shankara Bharanam' poster and wrote: "From the Streets of New York to the Gangs of Bihar... A wild journey of his life!!". What does this mean?
Please Wait while comments are loading...