twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫస్ట్ లుక్కే ఇలా ఉంది,ఫైనల్ లక్ ఏమవుందో (ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్: ఇప్పుడు దర్శక,నిర్మాతలు అంతా సినిమా మీద కన్నా ప్రమోషన్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగా విడుదల చేసే ఫస్ట్ లుక్, టీజర్ ని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుని, రకరకాలు కాన్సెప్టు అనుకుని, వాటిల్లో ఒకటి ఫైనలైజ్ చేస్తూ కుస్తీ పడుతున్నారు. ఈ కసరత్తు తప్పకుండా బిజినెస్ కు సహకరిస్తుందనే నిజం. ఎందుకంటే ఇప్పుడు ఎవరూ సినిమాని చూపించి అమ్మటం లేదు. కాబట్టి ఫస్ట్ లుక్, టీజర్స్ ద్వారానే క్రేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రేక్షకులు సైతం వీటిని చూసే థియోటర్ వైపు వెళ్లాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటున్నారు.

    తొలి నుంచి తన సినిమాలో ఏదో విభిన్నతకు పట్టం కడతూ వస్తున్న నీలకంఠ...కమర్షియల్ సక్సెస్ లతో భాక్సాఫీస్ ని మాత్రం మెప్పించలేకపోతున్నారు. తాజాగా ఆయన హర్షవర్ధన్‌ రాణే ప్రధాన పాత్రలో నీలకంఠ దర్శకునిగా రూపొందిస్తున్న చిత్రం 'మాయ'. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని శనివారం హైదరాబాద్ లో విడుదల చేసారు.

    అయితే ఫస్ట్ లుక్ పెద్ద కిక్ ఇవ్వలేకపోయింది. సినిమాపై అంచనాలు రేపలేకపోయింది అనే మాటలు వినపడుతున్నాయి. నీలకంఠ ప్రతిభ మొత్తం ఏమైంది అంటున్నారు. చిన్న సినిమాకు ఫస్ట్ లుక్, టీజర్స్ ప్రధానం. ఈ ఫస్ట్ లుక్ ఇంత డల్ గా ఉంటే ... సినిమా పరిస్ధితి ఏమిటి అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

    స్లైడ్ షోలో...ఫస్ట్ లుక్ ఫొటోలు

    ఆవిష్కరణ

    ఆవిష్కరణ

    'మాయ' సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. మల్టీడైమన్షన్‌ రామ్మోహనర్‌రావు ఆవిష్కరించారు. తమ్మారెడ్డి భరద్వాజ స్వీకరించారు.

    తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ...

    తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ...

    ''నీలకంఠ చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనాన్ని చూపిస్తారు. ఇప్పుడు ఇందులోనూ తనదైన శైలిలో మాయ చేయబోతున్నారు'' అన్నారు.

    నీలకంఠ మాట్లాడుతూ ....

    నీలకంఠ మాట్లాడుతూ ....

    ''ఎక్స్‌ట్రాసెన్సరీ పెర్‌సెప్షన్‌ అనే అంశం మీద పరిశోధన చేసి ఈ కథ సిద్ధం చేసుకున్నాను. నిజానికి ఈ చిత్రాన్ని 'షో' సినిమాకు ముందే చేయాల్సింది. అతీంద్రియ దృష్టి ద్వారా జరగబోయేది ముందే తెలిస్తే ఏమవుతుంది అనే అంశం నేపథ్యంలో సినిమా నడుస్తుంది '' అన్నారు.

    స్క్రీన్ ప్లే హైలెట్...

    స్క్రీన్ ప్లే హైలెట్...

    నీలకంఠ కంటిన్యూ చేస్తూ... '' ప్రతి మనిషిలో కొన్ని శక్తులు ఉంటాయి. అతీంద్రియ శక్తులు ఉన్న మనుషులు అక్కడక్కడా కనిపిస్తుంటారు. అలాంటి శక్తి ఉన్న వ్యక్తులమీద తాను ఈ చిత్రాన్ని రూపొందించానని, తన మనసులో ఇటువంటి సినిమా చేయాలని ఎప్పటినుంచో ఉన్నదని తెలిపారు. వైవిధ్యంతో కూడిన స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దామని, కొత్త కథలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించవచ్చని, ఆ కథ కథనాలు ఈ చిత్రంలో ఉంటాయని, ప్రేక్షకులను సరికొత్త అనుభూతికి ఈ చిత్రం లోనుచేస్తుందన్న నమ్మకం ఉంది. '' అన్నారు.

    మధుర శ్రీధర్‌ మాట్లాడుతూ ...

    మధుర శ్రీధర్‌ మాట్లాడుతూ ...

    ''తెలుగు సినిమా చరిత్రలో ఓ మంచి థ్రిల్లర్‌ చిత్రంగా ఈ సినిమా నిలుస్తుంది. మాయ సినిమా రషస్‌ను చూశాను. నిర్మాతగా చాలా ధైర్యంగా ఉన్నాను. 80 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో చెప్పుకోదగ్గ థ్రిల్లర్ అవుతుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేలో పాటల్ని, జూన్‌లో సినిమాను విడుదల చేస్తాం'' అని అన్నారు.

    స్వరకర్త శేఖర్‌చంద్ర మాట్లాడుతూ...

    స్వరకర్త శేఖర్‌చంద్ర మాట్లాడుతూ...

    మంచి పాటలు కుదిరాయని, నీలకంఠ నుంచి చాలా నేర్చుకున్నానని, ఆర్.ఆర్. జరుగుతోందని తెలిపారు.

    ఆనందంగా ఉంది...

    ఆనందంగా ఉంది...

    ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉందని హర్షవర్ధన్ రాణే, అవంతిక, సుష్మ చెప్పారు.

    తెరముందు...

    తెరముందు...

    'మాయ' లో అవంతిక, సుష్మ, నందిని రాయ్‌ హీరోయిన్స్. నాగబాబు, ఝాన్సీ, అనితాచౌదరి, వేణు తదితరులు నటిస్తున్నారు.

    తెరవెనుక..

    తెరవెనుక..

    ఈ చిత్రానికి కెమెరా:బాల్‌రెడ్డి, ఎడిటింగ్:నవీన్ నూలి, సంగీతం:శేఖర్ చంద్ర, నిర్మాతలు:ఎం.వి.కె.రెడ్డి, మధుర శ్రీధర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:నీలకంఠ.ఎం.వి.కె.రెడ్డి, మధుర శ్రీధర్‌ నిర్మాతలు

    జాగ్రత్త పడాలి

    జాగ్రత్త పడాలి

    నీలకంఠ మరింత శ్రధ్ద తీసుకుని ఈ ఫస్ట్ లుక్ ని రూపొందించి ఉండాల్సింది. ఈ రోజు యూత్ ని టార్గెట్ చేయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకుని, వారి ఆలోచనలకు అందకుండా ఉంటేనే దృష్టి పెడుతున్నారు. ట్రైలర్స్ అయినా ఆకట్టుకునేలా విడుదల చేస్తే బాగుంటుంది అంటున్నారు.

    English summary
    Neelakanta is directing a thriller titled 'Maya'. Harsha Vardhan Rane is the lead actor. Avantika, Sushma and Nandini Rai are the female leads. The first look of the film has been released at Prasad Preview theatre in Hyderabad. Multi-dimension Rammohan Rao, Damu, Tammareddy Bharadwaja etc attended the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X