»   »  వర్మ 'బ్రూస్లీ' ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదిగో

వర్మ 'బ్రూస్లీ' ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదిగో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:రామ్‌చరణ్‌ 'బ్రూస్‌లీ'గా కనిపించబోతున్నాడు. ఈలోగా రాంగోపాల్‌ వర్మ ఓ బ్రూస్లీని చూపించబోతున్నారు. దీనికి సంబంధించిన ఓ ప్రచార చిత్రాన్ని వర్మ గురువారం ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం పోస్టర్ అందరినీ ఆకర్షిస్తోంది. ఆ పోస్టర్ ని ఇక్కడ చూడండి.

వర్మ మాట్లాడుతూ ''ఎంటర్‌ ది డ్రాగన్‌' నన్ను పిచ్చివాణ్ని చేసింది. ఆ సినిమాని 17 సార్లు చూశా. 'రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌' 23 సార్లు చూశా. అప్పటి నుంచి బ్రూస్లీ గురించిన ప్రతి విషయం తెలుసుకోవాలన్న ఉత్సాహం కలిగించింది. బ్రూస్లీ స్ఫూర్తితోనే కొన్ని లక్షల మంది మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకొన్నారు.

First look poster: RGV's Bruce Lee

ఆ ప్రయత్నం చేసిన వారిలో నేనూ ఒకణ్ని. 'నేను ఎలాంటి పద్ధతులూ లేని ఓ కొత్త పద్ధతిని' అని బ్రూస్లీ చెప్పాడు. అది నాకు బాగా నచ్చింది. బ్రూస్లీని ప్రేరణగా తీసుకొని ఓ కథ రాసుకొన్నా దాన్ని వెండితెరపైకి తీసుకొస్తున్నాను ''అన్నారు.

ఈ చిత్రం సౌండ్ ట్రాక్ ని ఇక్కడ చూడండి..

మార్షల్ ఆర్ట్స్ వదిలేసినప్పటికి, బ్రూస్ లీ గురించి, అతని ఆలోచనా విధానం గురించి తెలుసుకోవడం వదలలేదు. బ్రూస్ లీ స్టైల్ చాలా విధాలుగా నా సినిమాలపైనా, నా వ్యక్తిగత జీవితం పైన తన ప్రభావం చూపించింది. "పోరాటం అనే కళని అర్ధం చేసుకోవటం నిర్ణీతమైన విధానాలని తొలగించి, ఆ విధాన క్రమాలకి అవతల కళలోని భావాన్ని స్వతంత్రంగా వ్యక్తపరచటంలోనే నిగూడమై ఉంటుంది. చారిత్రక మూలాలని పక్కకి పెట్టి కొత్త పద్దతులని సృష్టించడం మనిషి బాధ్యత. చారిత్రక మూలాలని ప్రశ్నించకూడని గొప్ప విషయలుగా భావించకూడదు.

ఎప్పటి నుంచో అవలభించబడుతున్న విధానాల కన్నా కొత్త పద్దతులు సృష్టించే మనిషి వాటికన్నా ముఖ్యం" అని బ్రూస్ లీ చెప్పాడు. బ్రూస్ లీ చెప్పిన పై మాటల వల్ల మిగిలిన వారికన్నా భిన్నంగా ఉండటం ఎంతమాత్రం తప్పు కాదు అని భావించసాగాను. భిన్నంగా ఉండటం అంటే వ్యక్తిగతంగా ఉండటమే. వ్యక్తిగతంగా ఒక మార్షల్ ఆర్టిస్ట్ గా ఉండలేకపోయినప్పటికి నేను వ్యక్తిగతంగా ఒక మనిషిగాను, ఒక ఫిల్మ్ మేకర్ గాను ఉండటానికి డిసైడ్ అయ్యాను.

"నేను ఎలాంటి పద్దతులు లేని ఒక కొత్త పద్దతిని" అని బ్రూస్ లీ చెప్పాడు. అందులో నుంచే వచ్చిందే నా ఈ ఎలాంటి ఇజమ్ లేని రాముయిజం. ఇక విషయానికి వస్తే బ్రూస్ లీ ఎంతో మందికి ప్రేరణగా నిలవటానికి నేను అర్ధం చేసుకున్న కారణాలతో ఒక సినిమా తీయాలనే ధేయ్యంతో ఈ కధని తయారు చేసుకున్నాను.

English summary
RGV started shooting for Bruce Lee in 2013 itself but shelved the project abruptly. Now, RGV released the trailer of Bruce Lee just one day before the audio launch of the most eagerly awaited film in Tollywood, Ram Charan's Bruce Lee.
Please Wait while comments are loading...