»   »  డర్టీని మించిపోతుందేమో: విద్యా బాలన్ ‘బేగమ్ జాన్’ ఫస్ట్‌లుక్

డర్టీని మించిపోతుందేమో: విద్యా బాలన్ ‘బేగమ్ జాన్’ ఫస్ట్‌లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా బాలన్ త్వరలో 'బేగమ్ జాన్' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ బెంగాలీ డైరెక్టర్ శ్రీజిత్ ముఖర్జీ ఈ సినిమా ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు.

శ్రీజిత్ ముఖర్జీ బెంగాలీలో తెరకెక్కించిన రాజ్‌కహిని సినిమాను హిందీలో 'బేగమ్ జాన్'గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విద్యా బాలన్ ఫస్ట్ లుక్ స్టిల్ ఒకటి ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. విద్యా బాలన్ హుక్కా తాగుతూ ఉన్న ఈ ఫోటో హాట్ టాపిక్ అయింది.

First Look of Vidya Balan's Begum Jaan released

1947లో భారత దేశ విభజన సమయంలో పంజాబ్ లో బ్రోతల్ హౌస్ నడిపిన ఓ మహిళ పాత్రే ఈ బేగమ్ జాన్. 'బేగమ్ జాన్' చిత్రంలో విద్యా బాలన్ తో పాటు గుహర్ ఖాన్, పల్లవి శార్దా, ఇలా అరుణ్ తదితరులు నటిస్తున్నారు.

గతంలో విద్యా బాలన్ నటించిన 'డర్టీ పిక్చర్' అప్పట్లో సంచలనం. టైటిల్‌కి తగ్గట్టే ఆ చిత్రం చాలా డర్జీగా ఉందనే విమర్శలు వచ్చాయి. ఇపుడు 'బేగమ్ జాన్' ఫోటో చూసిన తర్వాత సినిమా అంతకంటే డర్జీగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. మార్చిలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

English summary
Vidya Balan stars in and as Begum Jaan, National Award Winning Bengali director Srijit Mukherji's Bollywood debut film. The film is a Hindi remake of Bengali film Rajkahini also directed by Mukherji. The first still of the movie, which is scheduled to release in March, features Vidya along with Gauahar Khan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu