»   » శివా...!శివా!! "శివాయ్" లోనే తొలి లిప్ లాక్ అట... సీన్ మాత్రం సూపర్ గా ఉంది

శివా...!శివా!! "శివాయ్" లోనే తొలి లిప్ లాక్ అట... సీన్ మాత్రం సూపర్ గా ఉంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమాలో అవసరం ఉన్నా లేకపోయినా ఈ మధ్య బాలీవుడ్ సినిమాలో లిప్ లాక్ చేయటాలైతే అయితే కామన్ గా మారాయి. ఈ మధ్య బాలీవుడ్ లో లిప్ లాక్ సన్నివేశాలు లేని సినిమాలు దాదాపుగా అరుదనే చెప్పాలి . ప్రతీ సినిమాలో నూ ఖచ్చితంగా ఒక లిప్ లాక్ సీన్ ఉండేలా చేసుకుంటున్నారు డైర్వెక్తర్లు. ఇక హీరోయిన్లు కూడా ఇదివరకు లా మరీ ముడుచుకు పోకుండా ముద్దులకి పచ్చ జండా ఊపేస్తూండటం తో హీరోలు కూడా పేదాలని కలిపి తెగ మూతులు కలిపేస్తున్నారు.

లేటెస్ట్ గా ఇప్పటి వరకు లిప్ లాక్ సీన్స్ కు దూరంగా ఉన్నాడనే ఇమేజ్ తెచ్చుకున్న అజయ్ దేవగన్ కూడా లిప్ లాక్ ఇచ్చి సంచలనం రేపాడు ? గత 25 ఏళ్ల కెరీర్ లో అజయ్ దేవగన్ ఇంతవరకు ఏ సినిమాలో లిప్ లాక్ ఇవ్వలేదు!! కానీ తాజాగా అయన నటిస్తున్న"శివాయ్" సినిమాలో హీరోయిన్ ఎరికా కార్ తో మనోడు ఘాటు ముద్దును పంచుకున్నాడు. ఈ ట్రెండ్ బాగా నడుస్తున్నా అజయ్ దేవగన్ మాత్రం ఇంత వరకు అలాంటి సీన్లకు దూరంగా ఉంటూ వచ్చాడు. కానీ తాను స్వయంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్న శివాయ్ సినిమా కోసం ఇన్నాళ్లుగా ఉన్న రికార్డ్ ను పక్కన పెట్టేశాడు.

First on screen liplock of Bollywood Hero

తన 25 ఏళ్ల కెరీర్ లో అజయ్ దేవగన్ ఇంతవరకు ఏ సినిమాలో లిప్ లాక్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు శివాయ్ సినిమాలో పోలిష్ నటి ఎరిక కార్ తో లిప్ లాక్ చేశాడు అజయ్. ఇప్పటికే ఈ సీన్ కు సంబందించిన పోస్టర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. "శివాయ్" సినిమా పూర్తీ కావొచ్చింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 28 న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో "దరఖాస్త్ ... " అంటూ సాగే పాటలో అజయ్ ఆ హీరోయిన్ తో ఘాటు లిప్ లాక్ ఇచ్చి సంచలనం రేపాడు. ఇప్పుడు ఈ కిస్ సీన్ బాలీవుడ్ లో సంచలనం గా మారింది ?

శివాయ్ ఈ దీపావ‌ళికి రిలీజ్ కానుంది. ఈ ఫిల్మ్‌కు సంబంధించిన ట్రైల‌ర్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. మంచు కొండ‌లు, విదేశీ లొకేష‌న్ల లో ఫిల్మ్‌ను షూట్ చేశారు. అజ‌య్ దేవ‌గ‌నే ఈ ఫిల్మ్‌కు ద‌ర్శ‌క‌, నిర్మాత బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నాడు. ఛేజింగ్‌, యాక్ష‌న్ సీన్లు హాలీవుడ్‌ను మించేశాయి. బ‌ల్గేరియాలోని బాల్క‌న్ ప‌ర్వ‌త శ్రేణుల్లో చాలా వ‌ర‌కు షూటింగ్ చేసిన‌ట్లు తెలుస్తోంది . పోలాండ్ న‌టి ఎరికా కార్‌, గిర్నీశ్ క‌ర్నాడ్‌, వీర్ దాస్‌, సైరా బాను కూడా ఈ ఫిల్మ్‌లో న‌టిస్తున్నారు. శివాయ్ ట్రైల‌ర్‌ పై బాలీవుడ్‌ ట్విట్ట‌ర్‌లో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది.

English summary
Ajay Devgn is all set to lock lips in his upcoming movie 'Shivaay.' Isn't that a surprising news? Ajay Devgn in his entire Bollywood career has never engaged in a lip-lock.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu