»   » ప్రీతి జింతా రహస్య వివాహానికి సంబంధించి తొలి ఫోటో లీక్

ప్రీతి జింతా రహస్య వివాహానికి సంబంధించి తొలి ఫోటో లీక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింతా ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. తన అమెరికా బాయ్ ఫ్రెండ్ జీని గుడెనఫ్ ను లాస్ ఏంజిల్స్ లో పెళ్లాడింది. అయితే ఈ వివాహం మీడియాకు తెలియకుండా రహస్యంగా జరుపుకోవడం గమనార్హం. తాజాగా వీరి వెడ్డింగ్ కు సంబంధించిన తొలి ఫోటో బయటకు వచ్చింది. ప్రీతి-జీని గుడెనఫ్ పెళ్లాడిన పెళ్లి పండపానికి సంబంధించిన ఫోటో లీక్ అయింది. పెళ్లి మండపం డిజైన్ బట్టి వీరి వివాహం ఇండియన్ హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగిందని స్పష్టమవుతోంది.

గతంలో ప్రీతి జింతా వివాహం జరిగినట్లు అనేక సార్లు ఫేక్ న్యూస్ ప్రచారంలోకి రావడంతో.... ప్రీతి జింతా వివాహం గురించి వార్త వినగానే... ఇది కూడా మరో పుకారే అని అంతా అనుకున్నారు. అయితే ప్రీతి జింతాకు విషెస్ చెబుతూ బాలీవుడ్ నటి సుస్మితా సేన్, ఫరాఖాన్, కబీర్ బేడీ తదితరులు ట్వీట్ చేయడంతో ప్రీతి వివాహం జరిగినట్లు ఖరారైంది.

Read Also: ప్రీతీ జింతా వివాదాస్పద లవ్ లైఫ్, ఎంత మందితో?

ప్రీతి జింతా క్లోజ్ ఫ్రెండ్స్ సుజానె ఖాన్(హృతిక్‌ రోషన్ మాజీ భార్య), సురిలీ గోయెల్ వివాహానికి హాజరయ్యారు. పెళ్లి రహస్యంగా చేసుకున్నా రిసెప్షన్ మాత్రం తన హోదాకు తగిన విధంగా గ్రాండ్ గా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. పెళ్లి తర్వాత నెల రోజుల పాటు అమెరికాలోనే హనీమూన్ ఎంజాయ్ చేయడానికి ఈ జంట ప్లాన్ చేసుకున్నారని అంటున్నారు. హనీమూన్ ముగిసిన తర్వాత ఏప్రిల్ నెలలో బాలీవుడ్ ఫ్రెండ్స్ కోసం రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. జీని గడెనఫ్ తో ప్రీతి జింతా గత 18 నెలలుగా డేటింగ్ చేస్తోంది.

ప్రీతి జింతా పెళ్లిడిన వ్యక్తి

ప్రీతి జింతా పెళ్లిడిన వ్యక్తి

న్ ప్రీతి జింతా ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. తన అమెరికా బాయ్ ఫ్రెండ్ జీని గుడెనఫ్ ను లాస్ ఏంజిల్స్ లో పెళ్లాడింది.

పెళ్లి మండపం

పెళ్లి మండపం

వీరి వెడ్డింగ్ కు సంబంధించిన తొలి ఫోటో బయటకు వచ్చింది. ప్రీతి-జీని గుడెనఫ్ పెళ్లాడిన పెళ్లి పండపానికి సంబంధించిన ఫోటో లీక్ అయింది.

సుస్మితా సేన్ ట్వీట్

ప్రీతి జింతా, జీని గుడెనఫ్ లకు విషెస్ చెబుతూ సుస్మితా సేన్ ట్వీట్

ఫరా ఖాన్ ట్వీట్

బాలీవుడ్ సెలబ్రిటీ, జ్యువెలరీ డిజైనర్ చేసిన ట్వీట్...

కబీర్ బేడీ

బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ ప్రీతి జింతాకు విషెస్ చెబుతూ చేసిన ట్వీట్

English summary
Hello peeps! Finally, Preity Zinta has tied the knot with her US based boyfriend and fiancé Gene Goodenough and today we have brought to you the first picture from the Preity Zinta's wedding. Sadly, the picture of is not of Preity & her hubby Goodenough but the mandap, where the duo performed all the wedding rituals.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu