»   » సూపర్.... డూపర్..., బాలయ్య ని ప్రేమిస్తున్నా: రామ్‌గోపాల్ వర్మ

సూపర్.... డూపర్..., బాలయ్య ని ప్రేమిస్తున్నా: రామ్‌గోపాల్ వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

'అన్నా... రెండు బాల్కనీ టికెట్లు కావాలి' అసలు ఇలాంటి డైలాగులు బాలయ్య నుండి ఊహించి ఉండం. కానీ ఇది సినిమా థియేటర్ సీన్ అనుకుంటే పొరపాటే... ఇదో యాక్షన్ సీన్. అదే మరి పూరి క్రియేటివిటీ అంటే. అసలు పూరీ స్టైల్లో బాలకృష్న ని ఇంతకు ముందు ఊహించటమే కష్టం. వేటకొడవలి తో వచ్చే బాలయ్యని చేతిలో గన్ తో మరీ స్టైలిష్ గా తీర్చి దిద్దాడు పూరీ.

ఈ రోజు లాంచ్ అయిన 'పైసా వసూల్' స్టంపర్ చూస్తే అందులో బాలయ్య పూరి మార్కులోనే కనిపించాడు. పూరి స్టయిల్లో ఊర మాస్ గా కనిపిస్తూ పూరి మార్కు డైలాగులతో మోత మోగించేశాడు బాలయ్య. ఇదివరకు ఉన్న బాలయ్య స్టైల్ వేరు ఇప్పుడు కనిపిస్తున్న బాలయ్య వేరు... దిస్ ఈజ్ అన్ యాక్షన్ ఫిలిమ్ అంటూ కంఫార్మ్ చేసేసాడు...యూట్యూబ్ లో ఊహించనంత వేగంగా వ్యూస్ పెరుగుతున్నాయి. ఇక నందమూరి అభిమానుల హంగామా చెప్పే పనే లెదు పూరీ డ్రగ్స్ కేసు గందరగోళం నుంచి ఇప్పుడు అంతా "పైసా వసూల్" మీదే పడ్డారు. ఈ నేపథ్యంలో, 'పైసా వసూల్' స్టంపర్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. 'సూపర్ సూపర్ డూపర్' అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు.


బాలయ్యా సూపర్ అంటూ కితాబిచ్చాడు. తన జీవితంలోనే తొలిసారి బాలయ్యను ఎంతగానో ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆఖరికి దేశం లో ఉన్న ప్రతీ సమస్యమీదా ట్వీటుతూనే ఉండే వర్మ కూడా ఈ సినిమా స్టన్నర్ వచ్చిన కొద్ది నిమిషాల్లోనే ఇప్పుడు ట్విట్టర్ లేదు కాబట్టి ఫేస్ బుక్ లో పోస్టేసాడు.


English summary
"Superrrrr superrrrrr duperrrrr first time ever I loved Balayya this much" Varma posted in his Face Book page About Paisa Vasool Stunner
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu