twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫోటో ఫీచర్: 5 తెలుగు చిత్రాలు ఈ రోజే రిలీజ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో బాక్సాఫీసు దగ్గర పెద్ద సినిమాల సందడి అస్సలు లేదు. దీంతో చిన్న సినిమాలు విజృంభిస్తున్నాయి. వారానికి ఐదు చొప్పున విడుదలవుతున్నాయి. ఆగస్టు 15న ఐదు చిత్రాలు విడుదలై సందడి చేశాయి. ఈ వారాంతంలో మరో ఐదు చిత్రాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి.

    సరైన సమయంలో థియేటర్లలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటే చిన్న సినిమాలు సైతం చక్కటి ఫలితాల్ని సాధిస్తాయన్న విషయం మరో మారు రుజువైంది. 'జగద్గురు ఆదిశంకర', 'దళం', 'అడ్డా', '1000 అబద్ధాలు', 'మెరీనా' చిత్రాలు ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చాయి. రిజెల్ట్ ఎలా ఉన్నా థియోటర్స్ దొరకటంతో అసలు రిలీజ్ కావటం వారికి సంతోషాన్ని ఇస్తోంది.

    ఈ వారం వీటికి మరో ఐదు సినిమాలు జతకలవబోతున్నాయి. చిన్న సినిమా విడుదలైతే చాలు... విజయం సాధించినంతగా సంబరపడిపోతుంటాడు నిర్మాత. తెలుగు చిత్ర పరిశ్రమలో అలా ఉంది పరిస్థితి. పెద్ద సినిమాల తాకిడికి చాలా చిన్న సినిమాలు విడుదలకు కూడా నోచుకోవు. ఒకవేళ మధ్యలో ఒకట్రెండు రోజులు ఖాళీ చూసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినా... ఆ తర్వాత పెద్ద సినిమా వచ్చిందంటే థియేటర్‌ నుంచి ఏత్తేయాల్సిన పరిస్థితి. అయితే గత రెండు వారాలుగా పరిశ్రమలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది.

    ఇక ఈ వారం వస్తున్న ఐదు చిత్రాలు..స్లైడ్ షోలో...

    ముందు.. తర్వాత...

    ముందు.. తర్వాత...

    సున్నితత్వం, సృజనాత్మక అంశాలతో సినిమాల్ని తీయడం మోహనకృష్ణ ఇంద్రగంటి శైలి. విలువలతో కూడిన చిత్రాల్ని తీయడానికి ఆయన ఇష్టపడుతుంటారు. 'గోల్కొండ హైస్కూల్‌' తర్వాత ఆయన తీసిన చిత్రం 'అంతకు ముందు ఆ తరువాత'. నిర్మాత ఎమ్‌.ఎస్‌.రాజు తనయుడు సుమంత్‌ అశ్విన్‌ కథానాయకుడిగా నటించారు. ఈషా నాయిక. కె.ఎల్‌. దామోదర్‌ప్రసాద్‌ నిర్మాత. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది.''ఒకరినొకరు ఇష్టపడడం మొదలయ్యాక... సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆ అనుబంధం మాటున ఎలాంటి విషయాలు బయటికొస్తాయి. వాటి ద్వారా ప్రేమికుల మధ్య ఎలాంటి అనుమానాలు చోటు చేసుకొంటాయి అనే అంశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటాయ' అంటున్నారు దర్శకుడు.

    వినోదాల స్కూటరు...

    వినోదాల స్కూటరు...

    ప్రేక్షకుల్ని నవ్వించడంలో వెన్నెల కిషోర్‌ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకొన్నారు. హాస్యనటుడిగా గుర్తింపును తెచ్చుకొన్నారు. ఇటీవల కథానాయకుడిగానూ అవకాశాలు అందుకొంటున్నారు. ఆయన నటించిన చిత్రం 'అతడు ఆమె ఓ స్కూటరు'. ప్రియాంకా ఛాబ్రా హీరోయిన్ . లక్ష్మణ్‌ గంగారపు దర్శకుడిగా పరిచయమయ్యారు. ''వినోదాత్మకంగా సాగే ఈ చిత్రం ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తుం ది' అంటున్నారు వెన్నెలకిషోర్‌.

    యూత్ టార్గెట్

    యూత్ టార్గెట్

    యువతరం తీసుకొనే నిర్ణయాల నేపథ్యంలో రూపొందిన చిత్రం 'తెలిసి తెలియక'. గీతానంద్‌, కృష్ణ, మైథిలి, హాసిని, సుధీర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. జయప్రకాష్‌ దర్శకుడు. కె.రంజిత్‌ దర్శకత్వంలో రూపొందిన 'ఎలా చెప్పను'. గత వారం రావాల్సిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

    హీరోయిన్ జీవితం ఆధారంగా ..

    హీరోయిన్ జీవితం ఆధారంగా ..

    సినీ రంగంలో దశాబ్దకాలంపాటు వెలిగిన ఓ హీరోయిన్ జీవితం ఆధారంగా తమిళంలో 'క్త్లెమాక్స్‌' అనే చిత్రం రూపొందింది. ఆ చిత్రం తెలుగులో 'గజ్జెలగుర్రం' పేరుతో విడుదలవుతోంది. సనాఖాన్‌ ముఖ్యభూమిక పోషించారు. ఈ చిత్రం తమిళ,మళయాళంలో ఆల్రెడీ విడుదలైంది.

    రాజేంద్రప్రసాద్ చిత్రం

    రాజేంద్రప్రసాద్ చిత్రం

    రాజేంద్రప్రసాద్‌.. న్యాయవాది సంజీవ్‌ చతుర్వేది పాత్రలో నటించిన చిత్రం 'వసుంధర నిలయం'. థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. రవీశన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శనివారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడో పూర్తయిన చిత్రాలే. 'అంతకుముందు... ఆ తరువాత', 'తెలిసి తెలియక', 'అతడు ఆమె ఓ స్కూటరు', 'వసుంధర నిలయం', 'గజ్జెలగుర్రం', 'ఎలా చెప్పను' చిత్రాలు ఈ వారం వస్తున్నాయి.

    English summary
    
 Five films are hitting the screens this weekend. With big films postponed, these small films are testing their luck at Box-office. But only one film that is making buzz is Anthakumundu AaTaruvatha (AMAT) starring Sumanth Ashwin and Eesha. AMAT carries good expectations and also the film is releasing in good number of screens. The other films that are releasing this Friday are - 1.Telisi Teliyaka 2. Ela Cheppanu 3. Gajjela Gurram 4. Atadu Aame Scooter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X