»   » జియా సూసైడ్ : ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో షాకింగ్ న్యూస్

జియా సూసైడ్ : ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో షాకింగ్ న్యూస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : గత నెల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటి జియా ఖాన్ కేసులో సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది. జియా కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇందులోని షాకింగ్ విషయాలు కేసును మలుపు తిప్పేలా కనిపిస్తున్నాయి.

ఓ ప్రముఖ ఆంగ్లప్రతిక కథనం ప్రకారం...జియా ఖాన్ ఫోరెన్సిక్ రిపోర్టులో ఆమె ఆత్మహత్య చేసుకున్న సయమంలో ఆల్కహాల్ సేవించి ఉందని తెలుస్తోంది. జియా బ్లడ్ టెస్ట్ రిపోర్టులో కొంతమేర ఆల్కాహాల్ శాతం ఉందని తేలినట్లు సమాచారం. ఈ ఫోరెన్సిక్ రిపోర్టును ఫోరెన్సిక్ లాబోరేటరీ డాక్టర్స్ పోలీసులకు సమర్పించారు.

Jiah Khan

మరో వైపు జియా ఖాన్ బాయ్ ఫ్రెండ్ సూరజ్ పంచోలి ఇటీవలే బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. మీడియా రిపోర్టు ప్రకారం ఈ కేసులో సూరజ్ నుంచి త్వరలోనే బయట పడే అవకాశం ఉందిని, జియా ఖాన్ ఆత్మహత్యకు అతను బాధ్యుడు కాదనే విధంగా కొన్ని పరిస్థితులు స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది.

జియా ఖాన్ జూన్ 3వ తేదీన ముంబై జుహు లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో ఆమె తల్లి సోదరి లేరు. పోస్టు మార్టమ్ రిపోర్టు ప్రకారం జియా ఖాన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్పష్టమయింది.

English summary
According to a leading daily, forensic report say that Jiah Khan was drunk at the time she committed suicide at her Apartment in Mumbai. Reportedly, some percentage of alcohol was found in Jiah's blood test report. The Director of Forensic Laboratory have submitted the forensic report to the police.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu