»   » అజిత్ మైండ్ బ్లోయింగ్.. సిక్స్‌ప్యాక్ వెనుక జయలలిత..

అజిత్ మైండ్ బ్లోయింగ్.. సిక్స్‌ప్యాక్ వెనుక జయలలిత..

Posted By:
Subscribe to Filmibeat Telugu

వివేకం (తమిళంలో వివేగమ్) చిత్రం కోసం సిక్స్ ప్యాక్‌తో తలా అజిత్ ముందుకు రావడం సినీ పరిశ్రమలో అందర్ని ఆశ్చర్యపరుస్తున్నది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అజిత్ సిక్స్ ప్యాక్‌తో కనిపించగానే అభిమానులతోపాటు సినీ నటులు కూడా షాక్ గురయ్యారు. అజిత్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

సీఎం జయలలిత సూచన మేరకే..

సీఎం జయలలిత సూచన మేరకే..

అజిత్ సిక్స్ ప్యాక్ చేయడానికి కారణం తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత అని తెలుస్తున్నది. 2015లో వేదాలమ్ చిత్రం విడుదలైన తర్వాత మర్యాదపూర్వకంగా జయలలితను అజిత్ కలుసుకొన్నారు. ఆ సందర్భంగా లావుగా కనిపించిన తలాను ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారట. దాంతో శరీర బరువును తగ్గించుకోవడంపై ద‌ృష్టి పెట్టాడట. అంతలో వివేకం చిత్ర దర్శకుడు శివ సిక్స్ ప్యాక్ ఆలోచన చెప్పాడట. దాంతో అజిత్ సిక్స్ ప్యాక్ కోసం చాలా శ్రమించి అభిమానులకు షాక్ ఇచ్చారు.

అదిరిపోయే లుక్ చూసి అగ్రనటుల ఫిదా

అదిరిపోయే లుక్ చూసి అగ్రనటుల ఫిదా

వివేకంలో అదిరిపోయే లుక్‌ను చూసి బాలీవుడ్, టాలీవుడ్, కోలివుడ్ హీరోలు అజిత్ పై ప్రశంసలు కురిపించారు. అజిత్ ప్రశంసించిన వారిలో బాద్షా షారుక్ ఖాన్, ధనుష్, రానా దగ్గుబాటి, శింబు, నయనతార తదితరులు ఉన్నారు. షారుక్ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ మేలో, సినిమా జూన్‌లో విడుదల కానున్నది.

ఇంటర్‌పోల్ అధికారిగా

ఇంటర్‌పోల్ అధికారిగా

సిరుథాయ్ శివ దర్శకత్వం వహిస్తున్న వివేకం చిత్రంలో అజిత్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఓ కేసు దర్యాప్తు కోసం చైన్నైకి వచ్చే అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, అక్షర హాసన్, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

అమ్మకు అజిత్ అంటే చాలా ఇష్టం

అమ్మకు అజిత్ అంటే చాలా ఇష్టం

తమిళ సినీ పరిశ్రమలో అజిత్ అంటే జయలలితకు చెప్పలేనంత అభిమానం. తరుచూ వీరిద్దరూ కలుసుకొని ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకొనేవారు. జయలలిత మరణించిన సమయంలో వివేకం చిత్ర షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్నారు. ఆమె మరణ వార్త తెలియగానే వెంటనే చెన్నైకి బయలుదేరి వచ్చారు. పురచ్చితలైవి సమాధి చెంతకు వెళ్లి ఘనంగా నివాళులర్పించారు. ఆ సమయంలో అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపడుతారనే ఊహాగానాలు వచ్చాయి.

English summary
Jayalalithaa was the reason behind Ajith's weight loss. Jaya quizzed about Ajith's beefed up body.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu