»   » కాటమరాయుడు బంపర్ ఆఫర్.... ఒకటి టికెట్ కొంటే ఒకటి ఫ్రీ....

కాటమరాయుడు బంపర్ ఆఫర్.... ఒకటి టికెట్ కొంటే ఒకటి ఫ్రీ....

Posted By:
Subscribe to Filmibeat Telugu

'కాటమరాయుడు' తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ లోనూ జోరు చూపిస్తున్నాడు. ఓవర్సీస్ లో రాయుడు 2మిలియన్ మార్క్ ని టార్గెట్ గా పెట్టుకొని రంగంలోకి దిగాడు. ఇప్పుడా టార్గెట్ ని సునాసయంగా చేరుకొంటాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీలో బినిఫిట్ షోల ద్వారా 6లక్షల డాలర్లకి పైగా వసూలు చేసినట్టు అంచనా వేస్తున్నారు. ఇంకా పక్కా లెక్కలు తేలాల్సివున్నాయి.

ఎప్పుడూ లేనంతగా

ఎప్పుడూ లేనంతగా

గతంలో పవన్ సినిమాలకు ఎప్పుడూ లేనంతగా ఓవర్సీస్‌లో కాటమరాయుడికి కలెక్షన్లు వస్తున్నాయి. గతంలో పవన్ 'అత్తారింటికి దారేది' చిత్రం 1.90మిలియన్ డాలర్లు, సర్థార్ - గబ్బర్ సింగ్ 1.07మిలియన్ డాలర్లు వసూలు చేశాయి. ఓవర్సీస్ లో సూపర్ స్టార్ మహేష్, పవన్ కళ్యాణ్, నాని ల జోరు కనిపిస్తోంది.


 ఓవర్సీస్ ర్యాంకు

ఓవర్సీస్ ర్యాంకు

కాటమరాయుడుతో పవన్ ఓవర్సీస్ ర్యాంకుని మెరుగుపర్చుకోవడం ఖాయం. పవన్ సినిమాల్లో ఓవర్సీస్‌లో అత్తారింటికి దారేది సినిమా మాత్రమే 1.90 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించి టాప్-6 ప్లేస్‌లో నిలిచింది. ఈ రికార్డును దాటేస్తుందని పవన్ అభిమానులే కాదు.. ట్రేడ్ వర్గాలు కూడా భావిస్తున్నాయి.


మిలియన్ డారల్ల మార్కు

మిలియన్ డారల్ల మార్కు

ఇప్పటికే ఈ సినిమా ఒక మిలియన్ డారల్ల మార్కును దాటేసింది. ఇక రానున్న రోజుల్లో మరో మిలియన్ డాలర్ల మార్కును దాటేయడం పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకుల భావన. కాగా.. అమెరికాలో ఈ సినిమా టికెట్లకు కొన్ని సోషల్ మీడియా యాప్‌లు పలు రాయితీలు కల్పిస్తున్నాయి.


టికెట్ ఉచితంగా

టికెట్ ఉచితంగా

ఫండాంగో యాప్ ద్వారా రెండు కానీ అంతకంటే ఎక్కువగానీ టికెట్లను కొంటే.. మరో టికెట్ ఉచితంగా ఇస్తున్నారు. అలాగే రీగల్, ఏఎమ్‌సీ, సినీమార్క్‌ దగ్గర మంగళవారం ఈ సినిమా టికెట్లు .. ఒకటి కొంటే మరొకటి ఉచితంగా ఇస్తున్నారు. ఎన్నారైలు ఈ అవకాశాన్ని పెద్ద సంఖ్యలో వినియోగించుకుంటున్నారు.


రిలీజ్ కి ముందే రూ. 85కోట్లు

రిలీజ్ కి ముందే రూ. 85కోట్లు

దాదాపు రూ. 30కోట్ల బడ్జెట్ తో 'కాటమరాయుడు' పూర్తయ్యింది. పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ కాకుండా వేసిన బడ్జెట్ లెక్క ఇది. అయితే, ప్రీ-రిలీజ్ రూపంలో దాదాపు రూ. 115కోట్లు వసూలు చేసింది కాటమరాయుడు. ఈ లెక్కన రిలీజ్ కి ముందే రూ. 85కోట్ల లాభాలని తెచ్చిపెట్టింది. ఇక ఓవర్సీస్లో కూడా లాభాలు ఆశాజనకంగానే ఉన్నాయి కాబట్టి. కాటమ రాయుడు పవన్ ఆర్థిక భారాన్ని తగ్గించినట్టేనా??


English summary
The Best offer on Katamarayudu movie Tickets in overseas in Trending now some apps are offering Buy one and Getone free offer for Katamarayuduu Tickets
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu