»   » ఫన్నీసైడ్: కొరటాల శివ కక్కుర్తి, సమంత ర్యాగింగ్, ఫీలైన ఎన్టీఆర్!

ఫన్నీసైడ్: కొరటాల శివ కక్కుర్తి, సమంత ర్యాగింగ్, ఫీలైన ఎన్టీఆర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సమంత, నిత్యా మీనన్ హీరో హీరోయిన్లుగా.... మోహన్ లాల్ కీలకమైన పాత్రలో తెరకెక్కిన 'జనతా గ్యారేజ్' మూవీ సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజవుతున్న సంగతి తెలిసిందే.

సినిమా ప్రమోషన్లో భాగంగా ఎన్టీఆర్, కొరటాల శివ, సమంత లతో చిత్రీకరించిన స్పెషల్ ఇంటర్వ్యూ వీడియో రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన అనేక విషయాలు చెప్పుకొచ్చారు. ఈ కన్వర్జేషన్లో కొన్ని ఫన్నీ థింగ్స్ చోటు చేసుకున్నాయి.


సమంత మాట్లాడుతూ..... ఎన్టీఆర్ షూటింగ్ సమయంలో నన్ను ఎప్పుడూ గర్ల్ గా చూడలేదు. అతని మైండ్ లో నేను, అతను బాయ్స్ అని ఉండేది అన్నారు. సమంత నోట ఆ మాట రాగానే ఒక్కసారిగా నవ్వులు పూసాయి.


వెంటనే అందుకున్న ఎన్టీఆర్...అన్నీ తను మాట్లాడుతుంటే నేనెందుకండీ మాట్లాడటం, బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజ్ తనయితే, సిద్దార్థ నేను అంటూ వ్యాఖ్యానించారు. దీనికి సమంత స్పందిస్తూ మీరు సిగ్గు పడతారు కదా అందుకే నేను మాట్లాడుతున్నా అంటూ పంచ్ ఇచ్చారు.


ఈ ఇంటర్వ్యూలో మరిన్ని పంచ్ లు పేలాయి, ఓ క్రమంలో ఎన్టీఆర్ ఫీలయి వెళ్లిపోయారు...


తను ఏడిస్తే నేనే ఏడ్చేస్తా

తను ఏడిస్తే నేనే ఏడ్చేస్తా

ఈ క్రమంలో సమంతను ఎన్టీఆర్ పొగుడుతుంటే....సమంత మొహం అదోలా పెట్టేసింది. తను ఏడిస్తే నేనే ఏడ్చేస్తా, మీరు కాస్త కంట్రోల్ చేయండి అంటూ కొరటాల శివకు సూచించారు ఎన్టీఆర్.


సమంతను తట్టుకోలేక

సమంతను తట్టుకోలేక

తను మాట్లాడుతుంటే మధ్య మధ్యలో సమంత అడ్డు పడుతుంటే ఎన్టీఆర్ ఫీలై అక్కడి నుండి వెళ్లి పోయే ప్రయత్నం చేసారు... సీరియస్ గా ఏమీ కాదు, ఫన్నీగానే!


అబద్దాలు

అబద్దాలు

ఎన్టీఆర్ సమంతలోని రొమాంటిక్ యాంగిల్ గురించి మొదలు పెట్టగా.... ఎన్టీఆర్ అన్నీ బద్దాలు చెబుతున్నాడు... రొమాన్స్ లేదు, ఏమీ అంటూ సమంత మళ్లీ ఆయన మాటలకు అడ్డు పడే ప్రయత్నం చేసింది.


ర్యాగింగే..

ర్యాగింగే..

ఎక్కడైనా డైరెక్టర్ యాక్టర్లను బయపెడతాడు....కానీ సమంతకు, నిత్యా మీనన్ కు నేనంటే అసలు భయమే లేదు... నన్ను సెట్లో రోజూ ర్యాగింగ్ చేసే వారు అంటూ కొరటాల శివ చెప్పుకొచ్చారు.


నావల్ల కావడం లేదన్న ఎన్టీఆర్

నావల్ల కావడం లేదన్న ఎన్టీఆర్

జనతా గ్యారేజ్ లో మా కాంబినేషన్లో మంచి హిట్టు పడితే సమంతతో చేయడం ఇక ఆపేద్దామనుకుంటున్నా, నా వల్ల కావడం లేదు అంటూ ఎన్టీఆర్ చమత్కరించారు.


హీరోల ఇమేజ్ మార్చను

హీరోల ఇమేజ్ మార్చను

నేనెప్పుడూ హీరోల ఇమేజ్ మార్చే ప్రయత్నం చేయను. ఇమేజ్ సంపాదించుకోవడం అనేది చాలా కష్టమైన పని, ఎన్నో ఏళ్లు శ్రమ పడితే ఒక ఇమేజ్ వస్తుంది. మాకెవరికీ ఒక ఇమేజ్ ఉండదు, ఆ ఇమేజ్ ఉందనే వెళ్లాం, కథరాసాం... దాన్ని మార్చే ప్రయత్నం చేయలేదు అన్నారు కొరటాల శివ.


నా కక్కుర్తి ఏంటంటే..

నా కక్కుర్తి ఏంటంటే..

నా కక్కుర్తి ఏంటంటే... ఎక్కువ మంది నా సినిమా చూసేయాలని ఉంటుంది. అందుకోసమనే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయే తప్ప మాసు, క్లాసు అనే లెక్కలు ఎప్పుడూ చేయలేదు అన్నారు కొరటాల.


పూర్తి ఇంటర్వ్యూ వీడియో

జనతా గ్యారేజ్ చిత్రానికి సంబంధించిన పూర్తి ఇంటర్వ్యూ వీడియో


English summary
The Janatha Garrage Telugu movie key players Jr NTR, samantha and Koratala Shiva spoke about the film in an interview, on occasion of the release of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu