»   » ఇదో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్: విజయ్ దేవరకొండ "టాక్సీవాలా " ఫస్ట్ లుక్

ఇదో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్: విజయ్ దేవరకొండ "టాక్సీవాలా " ఫస్ట్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి చిత్రాల‌తో న‌టుడుగా, యువ హీరోల్లో సెన్సేషనల్ స్టార్ గా స్టార్‌డ‌మ్ తెచ్చుకున్న‌ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం టాక్సీవాలా. టాలీవుడ్ అగ్ర‌నిర్మాణ‌సంస్థ‌లు జిఏ 2 మరియు యువి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్ కె ఎన్ ఈ చిత్ర నిర్మాత‌. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా తెరెగేట్రం చేస్తున్నారు. విజయ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిపోయే చిత్రంగా టాక్సీవాలా ఉండబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మే 18న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడ‌దుల‌వుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుద‌ల చేశారు.

GA 2, UV Pictures, Vijay Devarakonda’s Taxiwala First Look Release

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ... విజయ్ దేవరకొండకున్న క్రేజ్, పాపులారిటికి దృష్టిలో పెట్టుకుని ఈ క‌థ‌ని ద‌ర్శ‌కుడు త‌యారుచేశాడు. దానికి తగ్గట్టుగానే అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే విధంగా విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ను దర్శకుడు రాహుల్ తీర్చిదిద్దాడు. విజయ్ మ్యానరిజమ్స్, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తాయి. డైరెక్టర్ రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్ టాక్సీవాలా లో హైలైట్ గా నిలుస్తాయి. స్ట్రాంగ్ కంటెంట్, ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్ ను దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మించాం. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మే 18న టాక్సీవాలా ను ప్రపంచవ్యాప్తంగా గ్రాండియర్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రం మెద‌టి లుక్ ని విడుదల చేయ‌టానికి ముందుగా ఓ టైటిల్ రివీల్ చేస్తూ వీడియో ఒక‌టి విడుదల చేశాము. చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌డు మెదటి లుక్ ని విడుద‌ల చేశాము..అని అన్నారు.

ద‌ర్శ‌కుడు రాహుల్ సంక్రిత్యాన్ మాట్లాడుతూ.. మేము రిలీజ్ చేసిన టైటిల్ కి చాలా మంచి రెస్పాన్స్ రావ‌టం చాలా ఆనందంగా వుంది. అలాగే ఈ రోజు మెద‌టి లుక్ ని విడుదల చేశాము. టాలీవుడ్ లో మా చిత్రం గురించి మా లుక్ గురించి మాట్లాడుకుంటున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం మా నిర్మాణ సంస్థ‌లు జిఏ2, యు.వి పిక్చ‌ర్స్ మ‌రియు మా హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ. ఇలాంటి మంచి అవకాశాన్ని నాకు అందించిన వీరంద‌రికి నా హ్రుద‌య‌పూర్వ‌క ద‌న్య‌వాదాలు. ఈ చిత్రాన్ని సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందిస్తున్నాము. ఆద్యంతం కామెడి గా ప్రేక్ష‌కుల్ని న‌వ్విస్తూ థ్రిల్ చేస్తుంది. ఆర్జున్ రెడ్డి లో విజ‌య్ దేవ‌రకొండ ని ఓక డైమ‌న్ష‌న్ లో చూసారు. మా టాక్సివాలా లో మ‌రో డైమ‌న్ష‌న్ లో చూస్తారు. విజ‌య్ టైమింగ్ కి ప్రేక్ష‌కులు ఫిదా అవ్వాల్సిందే. అంత‌లా త‌న న‌ట‌నతొ ఆక‌ట్టుకున్నాడు. త్వ‌ర‌లో ఈ చిత్రానికి సంభందించిన మ‌రిన్ని ఇంట్ర‌స్టింగ్ టాపిక్స్ తెలియ‌జేస్తాము.. అని అన్నారు

GA 2, UV Pictures, Vijay Devarakonda’s Taxiwala First Look Release

నటీనటులు
విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్, కళ్యాణి, మధునందన్, సిజ్జు మీనన్, రవి ప్రకాష్, రవి వర్మ, ఉత్తేజ్, విష్ణు

సాంకేతిక వర్గం
పబ్లిసిటీ డిజైనర్ - అనంత్ కంచర్ల
పిఆర్ఓ - ఏలూరు శ్రీను
సౌండ్ - సింక్ సినిమా
స్టంట్స్ - జాషువా
ఆర్ట్ డైరెక్టర్ - శ్రీకాంత్ రామిశెట్టి
లిరిక్స్ - కృష్ణ కాంత్
మ్యూజిక్ - జేక్స్ బిజాయ్
ఎడిటర్, కలరిస్ట్ - శ్రీజిత్ సారంగ్
సినిమాటోగ్రాఫర్ - సుజిత్ సారంగ్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్ - సాయి కుమార్ రెడ్డి
నిర్మాత - ఎస్ కె ఎన్
ప్రొడక్షన్ హౌజ్ - జీఏ 2 మరియు యువి పిక్చర్స్
స్టోరీ, డైరెక్షన్ - రాహుల్ సంక్రిత్యాన్

English summary
Vijay Devarakonda won accolades for his acting in Pelli Choopulu and he proved his commercial stamina with his last outing Arjun Reddy. Right now, he is busy with his upcoming film “Taxiwala”. Tollywood top production houses GA 2 and UV Pictures, which both has good taste in making meaningful films, are producing the film jointly. SKN is foraying into production with the film which marks directorial debut for Rahul Sankrithyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X