Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గమనించారా? : ‘గోపాల గోపాల’లో గబ్బర్‌సింగ్-2 హీరోయిన్
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం గబ్బర్‌సింగ్-2 లో పవన్ సరసన అనీషా ఆంబ్రోస్ ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఈ లోగా పవన్ తాజా చిత్రం ‘గోపాల గోపాల' చిత్రంలో నటించింది. అయితే సినిమా చూసాం కదా...ఎక్కడ మేము గుర్తించలేదే అనుకుంటున్నారా. అయితే ఇది మీరు చదవాల్సిందే.
‘గోపాల గోపాల' సినిమాలో తను ఓ టీవీ చానల్ హోస్ట్‌గా వెంకటేష్‌ను ఇంటర్వ్యూ చేస్తూ కనిపిస్తుంది. అనీషా ఆంబ్రోస్ తెలుగులో ఆలియాస్ జానకి అనే ఒక్క చిత్రంలో మాత్రమే నటించింది. తర్వాత ఏకంగా గబ్బర్‌సింగ్-2లో పవర్‌స్టార్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం పొందింది. అయితే ఆమెను గబ్బర్‌సింగ్-2లో హీరోయిన్‌గా పవనే రికమండ్ చేశారని సమాచారం.
చిత్రం విషయానికి వస్తే...
పవన్ కల్యాణ్ మరోసారి తన తిక్కేంటో, ఆ తిక్కకున్న లెక్కేంటో చూపించబోతున్న సంగతి తెలిసిందే. 'గబ్బర్ సింగ్'తో అభిమానుల్ని అలరించిన పవన్ ఇప్పుడు అంతకు రెట్టింపు వినోదాలు పంచిపెట్టబోతున్నాడు. ఔను 'గబ్బర్‌సింగ్ 2' త్వరలో పట్టాలెక్కబోతోంది. చిత్రానికి సంబంధించిన పూర్వ నిర్మాణ కార్యక్రమాలు సాగుతున్నాయి. 'పవర్'తో ఆకట్టుకొన్న కె.ఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వం వహిస్తారు. హీరోయిన్ గా అనీషా అంబ్రోస్‌ను ఎంచుకొన్నారు. 'అలియాస్ జానకి'తో తెరపై సందడి చేసింది అనీషా. ఆ సినిమా సరిగా ఆడకపోయినా 'గబ్బర్‌సింగ్ 2'లో అవకాశం రావడం అదృష్టమనే చెప్పాలి.

పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, ఎరోస్ ఇంటర్నేషనల్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శరత్‌మరార్ నిర్మాత. వచ్చే నెలలో 'గబ్బర్‌సింగ్2' సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రం గబ్బర్‌సింగ్‌కి సీక్వెల్‌గానీ, ప్రీక్వెల్‌గానీ కాదట. బాలీవుడ్ 'దబాంగ్'కీ ఎలాంటి సంబంధం లేదట. యాక్షన్, వినోదం మేళవించిన కథ పవన్ రాసుకొన్నారని యూనిట్ చెబుతోంది. బ్రహ్మానందం, అలీతో పాటు 'గబ్బర్‌సింగ్ అంత్యాక్షరి గ్యాంగ్' వినోదాలు పంచబోతోంది. చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఆర్ట్: ఆనంద్ సాయి, ఛాయాగ్రహణం: జయనన్ విన్సెంట్.
‘అత్తారింటికి దారేది' విజయం తర్వాత వెంటనే ‘గబ్బర్‌సింగ్ 2' మొదలవుతుందని ప్రేక్షకులు భావించారు. కానీ పవన్ ఎన్నికలతో బిజీ కావడంతో ఆ ప్రాజెక్టు సెట్స్ మీదకు వెళ్లడానికి ఆలస్యమైంది. పవన్‌కల్యాణ్ కెరీర్‌లో ‘పులి', ‘తీన్‌మార్', ‘పంజా' తర్వాత విడుదలైన సినిమా ‘గబ్బర్‌సింగ్'. హిందీలో సల్మాన్‌ఖాన్ నటించిన ‘దబాంగ్'కు రీమేక్ ఇది. ‘గబ్బర్ సింగ్' విజయాన్ని ‘అత్తారింటికి దారేది' కొనసాగించింది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అత్తారింటికి దారేది' పైరసీ గొడవలను అధిగమించి బాక్సాఫీసు వద్ద కొత్త రికార్డుల్ని సృష్టించింది. ఈ సినిమా విడుదలై సరిగ్గా ఏడాది అవుతోంది.
పవన్ కల్యాణ్ కెరీర్‌లో తొలిసారి మరో అగ్ర హీరోతో కలిసి తెర పంచుకుంటున్నారు. వెంకటేష్, పవన్‌కల్యాణ్ కలిసి ‘గోపాల గోపాల'లో నటిస్తున్నారు. కిశోర్ పార్థాసాని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం పవన్‌కల్యాణ్ ‘గోపాల గోపాల'తో బిజీగా ఉన్నారు. హిందీలో ఘన విజయాన్ని మూటగట్టుకున్న ‘ఓ మై గాడ్'కు రీమేక్ ఇది. మరో వైపు ‘గబ్బర్‌సింగ్ 2' పనులు కూడా ముమ్మరమవుతున్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. జనవరిలో మొదటి షెడ్యూల్ ప్లాన్ చేసారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 10 రోజుల పాటు షూటింగ్ జరుగుతుందట. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ వివరాలు వెల్లడికానున్నాయి.