For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘గబ్బర్‌సింగ్‌ 2’ హీరోయిన్ క్రిసమస్ వేడుకల్లో ...(ఫొటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ 2 లో అనీషా అంబ్రోస్‌ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈమె వైజాగ్ లో క్రిసమస్ జరుపుకుంటోంది. ఆమె మాట్లాడుతూ...మా బంధువులు దేశమంతటా ఉన్నారు. అయినా క్రిసమస్ ని మేము ఎప్పుడూ వైజాగ్ లో జరుపుకోవటానికే ఇష్టపడతాం. పండుగ సంప్రదాయం ప్రకారం మేము ఈ పండుగను జరుపుకుంటాము. మా అమ్మమ్మ సంప్రదాయ వంటలతో ఈ పండుగను ఘనంగా చేసుకుంటాం అన్నారామె. వైజాగ్ క్రిస్టియన్ అసెంబ్లీ చర్చ్ లో తను క్రిసమస్ వేడుకలకు హాజరవుతున్నారామె.

  https://www.facebook.com/TeluguFilmibeat

  చిత్రం విషయానికి వస్తే...

  Gabbar Singh 2 Heroine in Christmas Avatar

  పవన్‌ కల్యాణ్‌ మరోసారి తన తిక్కేంటో, ఆ తిక్కకున్న లెక్కేంటో చూపించబోతున్న సంగతి తెలిసిందే. 'గబ్బర్‌ సింగ్‌'తో అభిమానుల్ని అలరించిన పవన్‌ ఇప్పుడు అంతకు రెట్టింపు వినోదాలు పంచిపెట్టబోతున్నాడు. ఔను 'గబ్బర్‌సింగ్‌ 2' త్వరలో పట్టాలెక్కబోతోంది. చిత్రానికి సంబంధించిన పూర్వ నిర్మాణ కార్యక్రమాలు సాగుతున్నాయి. 'పవర్‌'తో ఆకట్టుకొన్న కె.ఎస్‌.రవీంద్ర (బాబి) దర్శకత్వం వహిస్తారు. హీరోయిన్ గా అనీషా అంబ్రోస్‌ను ఎంచుకొన్నారు. 'అలియాస్‌ జానకి'తో తెరపై సందడి చేసింది అనీషా. ఆ సినిమా సరిగా ఆడకపోయినా 'గబ్బర్‌సింగ్‌ 2'లో అవకాశం రావడం అదృష్టమనే చెప్పాలి.

  పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శరత్‌మరార్‌ నిర్మాత. వచ్చే నెలలో 'గబ్బర్‌సింగ్‌2' సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రం గబ్బర్‌సింగ్‌కి సీక్వెల్‌గానీ, ప్రీక్వెల్‌గానీ కాదట. బాలీవుడ్‌ 'దబాంగ్‌'కీ ఎలాంటి సంబంధం లేదట. యాక్షన్‌, వినోదం మేళవించిన కథ పవన్‌ రాసుకొన్నారని యూనిట్ చెబుతోంది. బ్రహ్మానందం, అలీతో పాటు 'గబ్బర్‌సింగ్‌ అంత్యాక్షరి గ్యాంగ్‌' వినోదాలు పంచబోతోంది. చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. ఆర్ట్‌: ఆనంద్‌ సాయి, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌.

  Gabbar Singh 2 Heroine in Christmas Avatar

  ‘అత్తారింటికి దారేది' విజయం తర్వాత వెంటనే ‘గబ్బర్‌సింగ్‌ 2' మొదలవుతుందని ప్రేక్షకులు భావించారు. కానీ పవన్‌ ఎన్నికలతో బిజీ కావడంతో ఆ ప్రాజెక్టు సెట్స్‌ మీదకు వెళ్లడానికి ఆలస్యమైంది. పవన్‌కల్యాణ్‌ కెరీర్‌లో ‘పులి', ‘తీన్‌మార్‌', ‘పంజా' తర్వాత విడుదలైన సినిమా ‘గబ్బర్‌సింగ్‌'. హిందీలో సల్మాన్‌ఖాన్‌ నటించిన ‘దబాంగ్‌'కు రీమేక్‌ ఇది. ‘గబ్బర్‌ సింగ్‌' విజయాన్ని ‘అత్తారింటికి దారేది' కొనసాగించింది.

  త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అత్తారింటికి దారేది' పైరసీ గొడవలను అధిగమించి బాక్సాఫీసు వద్ద కొత్త రికార్డుల్ని సృష్టించింది. ఈ సినిమా విడుదలై సరిగ్గా ఏడాది అవుతోంది.

  పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో తొలిసారి మరో అగ్ర హీరోతో కలిసి తెర పంచుకుంటున్నారు. వెంకటేష్‌, పవన్‌కల్యాణ్‌ కలిసి ‘గోపాల గోపాల'లో నటిస్తున్నారు. కిశోర్‌ పార్థాసాని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌ ‘గోపాల గోపాల'తో బిజీగా ఉన్నారు. హిందీలో ఘన విజయాన్ని మూటగట్టుకున్న ‘ఓ మై గాడ్‌'కు రీమేక్‌ ఇది. మరో వైపు ‘గబ్బర్‌సింగ్‌ 2' పనులు కూడా ముమ్మరమవుతున్నాయి.

  Gabbar Singh 2 Heroine in Christmas Avatar

  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. జనవరిలో మొదటి షెడ్యూల్ ప్లాన్ చేసారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 10 రోజుల పాటు షూటింగ్ జరుగుతుందట. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ వివరాలు వెల్లడికానున్నాయి.

  English summary
  Actress Anisha Ambrose might just be the next big thing in Tollywood with Pawan Kalyan’s Gabbar Singh 2. And for this Vizag girl, on Christmas, home’s where the heart is.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X