»   » ‘గబ్బర్ సింగ్-2’ మూవీపై అలా చెత్త ప్రచారం!

‘గబ్బర్ సింగ్-2’ మూవీపై అలా చెత్త ప్రచారం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్లో 'గబ్బర్ సింగ్-2' చిత్రం ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా....వివిధ కారణాలతో సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్లో మల్టీస్టారర్ మూవీ ఖరారు కావడంతో... సరికొత్త పుకార్లు తెరపైకి వచ్చాయి.

'గబ్బర్ సింగ్-2' ప్రాజెక్టు క్యాన్సిల్ కావడం వల్లనే పవన్ కళ్యాణ్ మరో సినిమాకు డేట్స్ ఇచ్చారనే చెత్త ప్రచారం మొదలైంది. అయితే పవన్ కళ్యాణ్ సన్నిహిత వర్గాలు మాత్రం ఈ చెత్త వార్తలను నమ్మొద్దని అంటున్నారు. 'గబ్బర్ సింగ్-2' చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఇంట్రెస్టు తీసుకుని చేస్తున్నారని, ఈ చిత్రం రద్దయ్యే ప్రసక్తే లేదని....సాంకేతిక కారణాలతోనే ఈచిత్రం ఆలస్యం అవుతోందని అంటున్నారు.

'గబ్బర్ సింగ్-2' చిత్రం స్క్రిప్టు పర్ ఫెక్టుగా వచ్చేలా దర్శకడు సంపత్ నంది శక్తిమేర ప్రయత్నిస్తున్నారని, త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కతుందని అంటున్నారు. ఈ సినిమా ఆలస్యం కావడానికి స్క్రిప్టు, హీరోయిన్ లాంటి సాంకేతిక కారణాలతో పాటు ఇతర కారణాలు ఉన్నాయని, అంతుకు మించి మరేమీ లేదని అంటున్నారు.

వెంకీ, పవన్ మల్టీ స్టారర్ మూవీ వివరాల్లోకి వెళితే...
బాలీవుడ్ మూవీ 'ఓ మై గాడ్' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కబోతున్న ఈచిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. 'ఓ మై గాడ్' చిత్రంలో అక్షయ్ కుమార్ దేవుడి పాత్రలో నటించగా.....తెలుగు రీమేక్‌లో పవన్ కళ్యాణ్ ఆ పాత్రను పోషించనున్నారు. హిందీలో పరేష్ రావల్ పోషించిన పాత్రను వెంకటేష్ పోషించనున్నారు. బాలీవుడ్లో ఈచిత్రం భారీ విజయం సాధించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్-వెంకటేష్ కాంబినేషన్లో తెలుగులోనూ ఈచిత్రం సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. దర్శకుడు, ఇతర వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

English summary
Film Nagar source said that Gabbar Singh 2 is not cancelled. Pawan hasn't liked any iterations of the script Sampath Nandi developed till date, he has asked him to work from a fresh perspective.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X