twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘గబ్బర్ సింగ్ - 2’కు లైన్ క్లియర్ అయింది!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ -2' చిత్రానికి లైన్ క్లియర్ అయినట్లే కనిపిస్తోంది. తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం స్క్రిప్టు పనులన్నీ పూర్తయ్యాయినట్లు తెలుస్తోంది. నవంబర్ నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని సమాచారం.

    సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం బడ్జెట్ దాదాపు 70 కోట్లు అని తెలుస్తోంది. ఈరోస్ వారు ఈ చిత్రం సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ఈ బడ్జెట్ ని పెట్టడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. 'రచ్చ'తో ఆకట్టుకున్న సంపత్‌.. ఆ తరవాత చేస్తున్న చిత్రమిదే. శరత్‌ మరార్‌ నిర్మాత. గబ్బర్ సింగ్-2 చిత్రాన్ని పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

    తొలిసారి సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్న తన స్నేహితుడికి మేలు జరుగాలనే ఉద్దేశ్యంతోనే ఈ సీక్వెల్ నిర్ణయం పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన కూడా ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాన్ ‘గోపాలా గోపాలా' షూటింగులో ఉన్నారు. ఈ షూటింగ్ పూర్తయిన తర్వాత ‘గబ్బర్ సింగ్ -2' చిత్రం షూటింగులో పవన్ కళ్యాణ్ పాల్గొన బోతున్నాడు.

    Gabbar Singh-2 shooting from November

    గోపాలా గోపాలా సినిమా వివరాల్లోకి వెళితే...
    పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ 'గోపాలా గోపాలా'. వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది. కిషోర్‌ పార్థసాని (డాలి) దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డి.సురేష్‌బాబు, శరత్‌మరార్‌ నిర్మాతలు.

    ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, దీక్షాపంత్‌, అంజు అస్రాని తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి.

    హిందీలో సూపర్ హిట్ అయిన 'ఓ మై గాడ్' చిత్రానికి ఇది రీమేక్. హిందీ వెర్షన్లో అక్షయ్ కుమార్ పోషించిన గోపాలుడి పాత్రను పవన్ కళ్యాణ్, పరేష్ రావల్ పోషించిన వ్యాపారి పాత్రను వెంకటేష్ తెలుగులో చేస్తున్నారు. 'ఓ మై గాడ్‌'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.

    English summary
    Pawan Kalyan's "Gabbar Singh 2" is all set to commence in November.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X