»   » మరో బర్నింగ్ స్టార్ వస్తున్నాడు: గాలి జనార్థన్ రెడ్డి కొడుకు సినిమా అరంగేట్రం

మరో బర్నింగ్ స్టార్ వస్తున్నాడు: గాలి జనార్థన్ రెడ్డి కొడుకు సినిమా అరంగేట్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

గాలి జనార్ధన్‌రెడ్డి దాదాపుగా ఇండియా మొత్తం తెలిసిన పేరు. వేల కోట్ల మైనింగ్ కుంబకోణం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ బడా రాజకీయ, వ్యాపార వేత్త చేసిన కూతురి పెళ్ళి ఒకప్పుడు దేశవ్యాప్త చర్చకు దారి తీసిన దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కుమారుడి వివాహం కంటే చర్చలకీ, అంతకు మించి వివాదానికీ తెర తీసింది. ఆ ఒక్క పెళ్ళితో మళ్ళీ ఒకసారి చర్చల్లోకి ఎక్కాడు గాలి జనార్థన్ రెడ్డి..

 Gali Janardhan Reddy Son Gali Kireeti Reddy Debut Movie in 2019

జనార్థన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి హీరో కావాలని భావిస్తున్నాడట. ఈ విషయాన్ని తండ్రితో చెప్పగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. కూతురి పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసిన డ్యాన్స్ ఈవెంట్‌లో కిరీటి రెడ్డి స్టెప్పులతో అదరగొట్టాడు. పలు తెలుగు సినిమా పాటలకు డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. గాలి జనార్ధన్‌రెడ్డి కూడా కొడుకును టాలీవుడ్ సినిమాతో వెండితెరకు పరిచయం చేయాలనుకుంటున్నట్లు తెలిసింది.

 Gali Janardhan Reddy Son Gali Kireeti Reddy Debut Movie in 2019

ఇందుకు సంబంధించి ఓ మంచి డైరెక్టర్‌ కోసం అప్పుడే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయట. కిరీటి రెడ్డి కూడా నటనలో శిక్షణ పొందడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే జనవరికి కొడుకును హీరోగా పరిచయం చేస్తూ గాలి జనార్ధన్‌రెడ్డి సినిమాను నిర్మించనున్నారు. పైగా సినీ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టాలని గాలి ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఈ సినిమాతో ఆయన ఆశ కూడా నెరవేరనుంది. ఈ సినిమా హిట్టయితే మరిన్ని సినిమాలు నిర్మించి, నిర్మాతగా మారాలని గాలి జనార్దన్‌రెడ్డి భావిస్తున్నాడట.
English summary
Kireeti performed on some Telugu numbers at Brahmini’s wedding. He was quite impressive with his moves over the songs. There is a talk that by this performance, celebrities over the marriage were given a hint about Kireeti being launched into the film industry as a Hero
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu