»   » మహేష్ బాబు ఐపీఎల్ కొనుగోలుపై... జయదేవ్ వివరణ!

మహేష్ బాబు ఐపీఎల్ కొనుగోలుపై... జయదేవ్ వివరణ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు సినిమాలు, వాణిజ్య ప్రకటనలకే పరిమితం అయ్యారు. తాజాగా ఆయన మరో కొత్త అవతారం ఎత్తబోతున్నట్లు, భారత్ లో అత్యంత ఆదరణ పొందించిన క్రీకెట్‌ వ్యాపారం ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు, తన బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరుపున కొత్తగా ఏర్పడబోయే ఐపీఎల్ టీం ‘వైజాగ్ సిక్సర్స్' కొనుగోలు చేయబోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తలపై గల్లా జయదేవ్ విరవణ ఇచ్చారు. ఈ వార్తల్లో నిజం లేదని, అటువంటి వాటిలపై తమకు ఆసక్తి లేదని స్పష్టం చేసారు.

ఆ సంగతి పక్కన పెడితే మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు' ఆడియో ఈ రోజు సాయంత్రం విడుదల కాబోతోంది. ఈ మేరకు హైదరాబాద్ లో గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో పంక్షన్ కు సంభందించి పాస్ లుకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. దీన్ని అడ్డం పెట్టుకుని కొందరు పాస్ లను అమ్ముతున్నారు. ఈ విషయమై చిత్రం నిర్మాతలు సీరియస్ గా తీసుకున్నారు. ట్విట్టర్ సాక్షిగా...అటువంటివి ఎంకరేజ్ చేయవద్దంటూ తెలియపరిచారు.

Galla Jayadev about Mahesh Babu to Buy IPL Team

సినిమాను ఆగస్టు 7న విడుదల చేయబోతున్నారు. వాస్తవానికి జులై 17నే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ‘బాహుబలి' కోసం వాయిదా వేసుకున్నారు. ఇక ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని, టీజర్ ని ఇప్పటికే విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో సైకిల్‌పై స్త్టెలిష్‌గా కనిపిస్తున్న మహేష్‌ లుక్‌ కి మంచి స్పందన వచ్చింది. మహేష్ బాబు సరసన శృతి హాసన్‌ హీరోయిన్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సీవీఎమ్‌) నిర్మిస్తున్నారు.

English summary
Mahesh Brother In Law and Guntur MP Galla Jayadev was posted in twitter that all this rumors are fake and he, Mahesh babu are not interested to buy an IPL Team.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu