»   » అప్పుల ఎఫెక్ట్: రాఘవ లారెన్స్ ‘గంగ’ రిలీజ్ మరింత ఆలస్యం

అప్పుల ఎఫెక్ట్: రాఘవ లారెన్స్ ‘గంగ’ రిలీజ్ మరింత ఆలస్యం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాఘవ లారెన్స్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గంగ' చిత్రం ఈ నెల 17నే విడుదల కావాల్సి ఉండగా...ఆర్థిక సమస్యలతో తెలుగులో విడుదల ఆగిపోయింది. మరో వైపు ఈ చిత్రం తమిళంలో ‘కాంచన-2'గా విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకెలుతోంది.

తెలుగులో ఈ చిత్రం విడుదల ఆగిపోవడానికి కారణం...నిర్మాత బెల్లంకొండ సురేష్ అప్పులే కారణమని అంటున్నారు. బెల్లంకొండ సురేష్ గత సినిమాలు అల్లుడు శ్రీను, రభస భారీ నష్టాలు మిగిల్చాయి. ఆయా సినిమాలకు సంబంధించిన అప్పులు బెల్లంకొండ ఇంకా క్లియర్ చేయలేదట. దీంతో తమ అప్పుల విషయం తేలిస్తేగానీ ‘గంగా' సినిమాను విడుదల కానివ్వమంటూ కూర్చున్నారట ఫైనాన్షియర్లు. సినిమా విడుదలైన తర్వాత వచ్చే కలెక్షన్లతో అప్పుత తీరుస్తానని అంటున్నాడట బెల్లంకొండ. అయితే గ్యారంటీ ఇవ్వనిదే ససేమిరా అంటున్నారట ఫైనాన్షియర్లు.


Ganga movie release postponed

సినిమా ఇప్పటికే వారం లేటయింది. సాధారణంగా అన్నీ ఓకే అయి, రిలీజుకు సిద్ధమయ్యాక వాయిదా పడితే చాలా కష్టం అవుతుంది. మళ్లీ థియేటర్లు దొరకడం కష్టం. దోచేయ్ సినిమాతో ఈ నెల 24 విడుదల చేద్దామనుకున్నారు కానీ....వీలయ్యేట్లు కనిపించడం లేదని అంటున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో? ఏమో?


సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవలే ట్రైలర్ విడుదల చేశారు. ఆ ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రాఘవ లెరెన్స్, తాప్సీ జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి ఫోటోగ్రఫీ: కిచ్చా, సంగీతం: థమన్, సమర్పణ: మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

English summary
Raghava Lawrence third movie in Muni Series titled as Ganga scheduled for release 17th April 2015 has been postponed.
Please Wait while comments are loading...