»   » ‘1-నేనొక్కడినే’లో... మహేష్ వారసుడు, ఇంటర్వ్యూలో వెల్లడి

‘1-నేనొక్కడినే’లో... మహేష్ వారసుడు, ఇంటర్వ్యూలో వెల్లడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు-సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న '1 నేనొక్కడినే' చిత్రం ఫస్ట్ లుక్ టీజర్.... ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌కు సినీ ప్రేమికుల నుంచి, మహేష్ బాబు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.

తాజాగా బుధవారం విజయవాడ వచ్చిన మహేష్ బాబు....మీడియాతో మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. ఈ చిత్రంలో మీ తనయుడు గౌతం నటించబోతున్నారా? అని అడిగిన ప్రశ్నకు మహేష్ బాబు స్పందిస్తూ ''మా వాడి కోసం ఓ పాత్ర ఉంది. కానీ వాడు చేస్తాడో లేదో తెలియదు. చేస్తే బాగుంటుంది'' అంటూ వ్యాఖ్యానించారు.

మహేష్ బాబు వ్యాఖ్యలను బట్టి '1-నేనొక్కడినే' చిత్రంలో ఆయన తనయుడు గౌతం నటించే అవకాశాలు ఉన్నాయని స్పష్టమవుతుంది. అయితే గౌతం చేస్తాడో లేదో అనే విషయమై మహేష్ బాబు కూడా పూర్తి క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ఏది ఏమైనా మహేష్ వారసుడు గౌతం తెరంగ్రేటంపై ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు...మహేష్ బాబు వ్యాఖ్యలు సంతృప్తిని ఇచ్చాయి.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. మహేష్ సినిమాకు ఆయన తొలిసారి పనిచేస్తుండటం విశేషం. ఇప్పటివరకూ సుకుమార్, దేవిశ్రీ కాంబినేషన్‌లో వచ్చిన అన్ని ఆల్బమ్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. వాటిని మించేలా అద్భుతమైన సంగీతాన్ని దేవిశ్రీ అందించినట్లు సమాచారం.

మహేష్‌బాబు పుట్టిన రోజైన ఆగస్ట్ 9న ఈ చిత్రం పాటలను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 12న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్లు వినికిడి. ఈ చిత్రానినికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు, స్టూడియో: 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్.

English summary
Journalists questioned Mahesh Babu about his son Gautam Krishna's role in 'One -Nenokkadine'. "We still don't know if he would do the role or not! It would nice if he does it!" Mahesh answered.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu