»   » మహేష్ తనయుడు గౌతం కృష్ణ ఫస్ట్‌లుక్ ఎప్పుడంటే?

మహేష్ తనయుడు గౌతం కృష్ణ ఫస్ట్‌లుక్ ఎప్పుడంటే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న '1-నేనొక్కడినే' చిత్రంతో మహేష్ బాబు తనయుడు గౌతంకృష్ణ బాల నటుడిగా తెరంగ్రేటం చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన గౌతం కృష్ణ ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 19న జరిగే ఆడియో వేడుకలో గౌతంకృష్ణ ఫస్ట్‌లుక్ విడుదల చేస్తారని సమాచారం.

ఈచిత్రాన్ని 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. కృతి సనన్‌ హీరోయిన్. ఇక డిసెంబరులో నిర్మాణానంతర కార్యక్రమాలు ముగించుకొని సంక్రాంతి పండగ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

Gautam Krishna's 1-Nenokkadine first look launch details

ఈ చిత్రంలో గౌతంకృష్ణ చిన్ననాటి మహేష్ బాబు పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే గౌతంపై గోవా, లండన్ తదితర ప్రాంతాల్లో సీన్లు చిత్రీకరించారు. సాధారణంగా మహేష్ బాబు సినిమా అంటేనే ఓ రేంజిలో అంచనాలుంటయి. పైగా సుకుమార్ దర్శకత్వం, గౌతం కృష్ణ తెరంగ్రేటం లాంటి అంశాలతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.

వినోదంతో పాటు అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రం ప్రేక్షకులను అలరించనుంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఛాయాగ్రహణం: రత్నవేలు, పోరాటాలు: పీటర్‌ హెయిన్స్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

English summary
Little Prince is all set to entertain with his first look soon. Gautam Krishna is making his debut as child artist with his dad super star Mahesh Babu’s 1-Nenokkadine. Filmmakers are planning to release his first look during the audio launch on December 19th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu