»   » ఇరగ దీసాడు....! మూడేనిమిషాల్లో.., ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ్ర‌స్ట్రీలోనే ఇదో రికార్డ్

ఇరగ దీసాడు....! మూడేనిమిషాల్లో.., ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ్ర‌స్ట్రీలోనే ఇదో రికార్డ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

డైన‌మిక్ హీరో గోపీచంద్ సినిమాల జోరు మ‌ళ్లీ ఊపందుకుంది. 'లౌక్యం' త‌ర్వాత రెండు సినిమాలు చేసినా ఆశించిన ఫ‌లితాన్నివ్వలేదు. దీంతో కొంచెం స్పీడ్ త‌గ్గించిన‌ట్లు అనిపించింది. కానీ అలాంటి రిమార్క్ ప‌డ‌కుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు. సంపత్ నంది దర్శకత్వం లో వస్తున్న "గౌతమ్ నందా" తో మళ్ళీ పాత గోపీ చంద్ లా కనిపించాలకుంటున్నాడు. తాజాగా సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే.

గోపీచంద్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా ఉంటుందట ఈ సినిమా కథ. అందుకే ఈ సినిమాని గోపీచంద్‌ ఎంతో ఇష్టపడి ఒప్పుకున్నాడనీ తెలుస్తోంది. ఎవరూ ఊహించని స్క్రీన్‌ప్లే ఈ సినిమాకి హైలైట్‌ అట. గోపీచంద్‌తో పాటు దర్శకుడు సంపత్‌ నంది కూడా సినిమాని ఛాలెంజింగ్‌గా తీసుకున్నానని చెప్పాడు. గోపీచంద్‌ ఈ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలతో జత కడుతున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్‌ సరసన హన్సిక, కేథరీన్‌ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు.


Gautam Nanda's 3 Minute Non Stop Action

ఈ సినిమాలో ఓ కీల‌క‌మైన ఫైట్‌.. సింగిల్ టేక్‌లో ఓకే అయిపోయింద‌ట‌. సుమారు డ‌జ‌ను మంది రౌడీల‌ను చిద‌క‌బాదిన ఆ ఫైట్ మూడంటే మూడే నిమిషాల్లో పూర్తి చేశార‌ట‌. ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ్ర‌స్ట్రీలోనే ఇదో రికార్డ్ అట‌. రామ్ ల‌క్ష్మ‌ణ్ ఫైట్ మాస్ట‌ర్లుగా వ్య‌వ‌హ‌రించిన ఈ యాక్ష‌న్ ఎపిసోడ్ కోసం చిత్ర‌బృందం దాదాపుగా వారం రోజులు క‌ష్ట‌ప‌డి రిహార్స‌ల్ చేసింద‌ట‌. సింగిల్ షాట్‌లో ఇంత పెద్ద ఫైట్ తీయ‌డం నిజంగా విశేష‌మే.


మ‌రి సిల్వ‌ర్ స్ర్కీన్‌పై ఆ ఫైట్ ఎంత మాసీగా వ‌చ్చిందో తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడ‌క త‌ప్ప‌దు. గోపీచంద్ సినిమాల‌న్నీ ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ రాబోతున్నాయి. బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ఆల్మోస్ట్ పూర్త‌యిపోయింది. ఈ చిత్రానికి ఆర‌డుగుల బుల్లెట్ అనే పేరు ఖ‌రారు చేశారు. మ‌రోవైపు ఆక్సిజ‌న్ కూడా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకీ గుమ్మ‌డికాయ్ కొట్టేస్తారు. ఈ ముడు సినిమాలూ రెండు నెల‌ల వ్య‌వధిలోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.

English summary
Hero Gopichand has shocked everyone by performing three-minute non-stop action episode without a single minute gap.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu