»   » హైదరాబద్ లో అడుగుపెట్టనున్న గౌతమీ పుత్ర శాతకర్ణి: హైదరాబాద్ లో నే రెండో షెడ్యూల్ మొదలు మొదలు

హైదరాబద్ లో అడుగుపెట్టనున్న గౌతమీ పుత్ర శాతకర్ణి: హైదరాబాద్ లో నే రెండో షెడ్యూల్ మొదలు మొదలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రధారిగా రూపొందుతోన్న ప్రెస్టీజియస్ 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. బిబో శ్రీనివాస్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాని నిర్మిస్తున్నారు.

ఇటీవల జాతీయఅవార్డును సొంతం చేసుకున్న క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవలే ఎన్నో హాలీవుడ్ చిత్రాలు షూటింగ్ జరుపుకునే మొరాకోలోని అద్భుతమైన లోకేషన్స్ మొరాకాలోని అట్లాస్ స్టూడియోస్, వరు జార్జియస్ లో మొరాకోలో సినిమా మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది.


మే 30 నుండి హైదరాబాద్ లోని చిలుకూరి బాలాజీ దేవాలయం సమీపంలో రెండో షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకోనుంది. ఇప్పటి వరకు ఎవరు వేయనంత పెద్ద యుద్ధనౌక సెట్ ను వేసి ఆ సెట్ లో షూటింగ్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ కోసం 200 మంది ఆర్టిస్టులకు ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ అధ్వర్యంలో యుద్ధానికి సంబంధించి కత్తిసామును ప్రాక్టీస్ చేయిస్తున్నారు.


Gautamiputra Satakarni 2nd schedule at hyderabad

ఈ సందర్భంగాదర్శకుడు జాగర్లమూడి క్రిష్ మాట్లాడుతూ... "నందమూరి బాలకృష్ణగారి వందవ చిత్రంగా ఎంతో ప్రెస్టిజియస్ గా ప్రారంభమైన మా గౌతమీపుత్రశాతకర్ణి మొరాకోలో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. మే 30 నుండి జూన్ 7వరకు రెండో షెడ్యూల్ హైదరాబాద్ లోని చిలుకూరి బాలాజీ ఆలయ సమీపంలో జరగనుంది.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబునాయుడుగారు ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న మహానాడులో భారతదేశాన్ని ఏకచత్రాధిపత్యంగా పాలించిన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవితగాథను సినిమాగా తెరకెక్కిస్తోన్న మా యూనిట్ ను అభినందించారు. అలాగే మా సినిమా గురించి ప్రస్తావించడం మా కెంతో గర్వంగా అనిపించింది. అందుకు చంద్రబాబునాయుడుగారికి మా నిర్మాతలు, యూనిట్ తరపును ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నాం" అన్నారు.


నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్: భూపేష్ భూపతి,సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.

English summary
A huge set is being erected near the Chilukuri Balaji temple in the suburb of Hyderabad for Gautamiputra Satakarni
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu