»   » అద్బుతం: ఇన్విటేషన్ తోనే అదరగొట్టారు., గౌతమీపుత్ర శాతకర్ణి ఇన్విటేషన్, ఆడియో ఫంక్షన్ ఏర్పాట్లూ

అద్బుతం: ఇన్విటేషన్ తోనే అదరగొట్టారు., గౌతమీపుత్ర శాతకర్ణి ఇన్విటేషన్, ఆడియో ఫంక్షన్ ఏర్పాట్లూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో ఫస్ట్‌ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం ఆడియో వేడుక ఈ నెల 26న తిరుపతిలోని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రు మున్సిపల్‌ హైస్కూల్‌లో జరుగుతుంది.'క్రిష్' దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను ఫస్ట్‌ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియోను ఈ నెల 26న తిరుపతిలో విడుదల చేయబోతున్నారు. ఇటీవలే కరీంనగర్ జిల్లాలోని కోటి లింగాలతో సహా తెలుగు రాష్ట్రాల్లోని 100 థియేటర్లలో చిత్ర ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ వేడుకకి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం నారా చంద్రబాబునాయుడు ముఖ్య అతిధులుగా హాజరవుతున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు వెల్లడిస్తూ కరీంనగర్‌ జిల్లా కోటిలింగాల సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని 100 థియేటర్లలో విడుదల చేసిన మా చిత్రం ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో సినిమా కోసం అందరూ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతోంది.


హ‌య్య‌స్ట్ వ్యూస్‌తో:

హ‌య్య‌స్ట్ వ్యూస్‌తో:

రీసెంట్‌గా విడుద‌లైన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. మ‌రే తెలుగు సినిమా ట్రైల‌ర్స్‌కు లేని విధంగా యూ ట్యూబ్ చానెల్‌లో హ‌య్య‌స్ట్ వ్యూస్‌తో గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఓ సెన్సేష‌న‌ల్ రికార్డును క్రియేట్ చేసింది. ఈ స్పంద‌న‌తో చిత్ర‌యూనిట్ ఈ సినిమా ఆడియో ఆవిష్క‌ర‌ణ వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. ఈ వేడుక‌కు కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌వుతున్నారు.


జాగర్లమూడి సాయిబాబు:

జాగర్లమూడి సాయిబాబు:

ఈ సంద‌ర్భంగా... వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ - `క‌రీంన‌గ‌ర్ జిల్లా కోటిలింగాల స‌హా రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 థియేట‌ర్స్‌లో విడుద‌లైన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఈ స్పంద‌న‌తో సినిమా కోసం అంద‌రూ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్థ‌మ‌వుతుంది.


డిసెంబ‌ర్ 26:

డిసెంబ‌ర్ 26:

ఈ సినిమా ఆడియో వేడుక‌ను డిసెంబ‌ర్ 26న తిరుప‌తిలోని శ్రీ పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రు మున్సిప‌ల్ హై స్కూల్ గ్రౌండ్‌లో గ్రాండ్‌గా నిర్వ‌హిస్తున్నాం. ఈ వేడుక‌కు కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌ నాయుడుగారు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడుగారు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌వుతున్నారు. నంద‌మూరి బాల‌కృష్ణ‌, హేమామాలిని, డైరెక్ట‌ర్ క్రిష్‌, శ్రియా శ‌ర‌న్ స‌హా టోట‌ల్ టీం ఈ వేడుక‌లో పాల్గొంటారు అన్నారు' అన్నారు.


వెంకయ్యనాయుడు:

వెంకయ్యనాయుడు:

ఆడియో వేడుకకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సీనియర్‌నటి హేమమాలినితో పాటు చిత్ర పరిశ్రమలోని నటీనటులు పెద్దఎత్తున హాజరవుతారన్నారు. అందరూ ఆహ్వానితులేనని.. వీవీఐపీలకు మాత్రమే ఎంట్రీ పాసులు ఇస్తున్నామన్నారు. ఆదివారం సాయంత్రానికి ఏర్పాట్లు పూర్తవుతాయన్నారు. సోమవారం సాయంత్రం తిరుపతిలోని ఓ హోటల్‌ వద్ద నుంచి 500 కార్లు, 1000 ద్విచక్ర వాహనాలతో బాలకృష్ణ భారీ ర్యాలీగా ఆడియో వేదిక వద్దకు చేరుకుంటారట.


క‌బీర్ బేడి:

క‌బీర్ బేడి:

నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హేమామాలిని, శ్రేయ, క‌బీర్ బేడి త‌దిత‌ర‌లు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ : బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్ : జ్ఞాన శేఖర్, ఆర్ట్ : భూపేష్ భూపతి, సంగీతం : చిరంత‌న్ భ‌ట్‌, సాహిత్యం : సీతారామశాస్త్రి, మాటలు : సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత : కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు : వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం : క్రిష్.


ఆహ్వాన పత్రం:

మరో సెన్సేషన్: గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో విడుదల కార్యక్రమం కోసం రూపొందించిన ఆహ్వాన పత్రం ఇప్పుడు మరో సెన్సేషన్ అయ్యింది. ఎప్పుడు లేని విధంగా, గౌతమిపుత్ర శాతకర్ణి డిజిటల్ ఆడియో ఇన్విటేషన్ అదిరింది. ఈ డిజిటల్ ఇన్విటేషన్ లో మొత్తం నాలుగు భాగాలు ఉండగా.. 1 నంబర్ ప్రెస్ చేస్తే.. బాలయ్య గురించి.. 2వ నంబర్ లో క్రిష్ గురించి ఆడియో వీడియో విజువల్స్ వస్తాయి. ఇక 3వ నంబర్ లో శాతకర్ణి ట్రైలర్ ను ఉంచగా... 4ను ప్రెస్ చేసినపుడు ఆడియో రిలీజ్ వేడుక.. వేదిక.. తేదీ.. సమయం.. అతిథుల లిస్ట్ వస్తుంది.


English summary
Take a look at the innovative Gautamiputra Satakarni Audio Launch Digital Invitation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu