Just In
Don't Miss!
- News
భారత్ లో యూకే కరోనా స్ట్రెయిన్ కేసుల కలకలం ... 114కు పెరిగిన కేసులు
- Sports
పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లీనే అత్యుత్తమం.. జడేజా కూడా: శ్రీలంక పేసర్
- Finance
4 వారాల్లో అతిపెద్ద పతనం, ఇన్వెస్ట్ చేస్తున్నారా.. కాస్త జాగ్రత్త!
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జార్జియాలో మళ్ళీ యుద్దం.. మీరు ఊహించలేని అద్బుతం గౌతమీ పుత్ర శాతకర్ణి
నందమూరి బాలకృష్ణ చారిత్రాత్మక వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మొరాకో, హైదరాబాద్‌లలో రెండు షెడ్యూల్స్‌ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మూడో షెడ్యూల్‌ని రెడీ అవుతోంది. జార్జియాలో జరగనున్న ఈ థర్డ్ షెడ్యూల్‌లో క్లైమాక్స్‌కి సంబంధించిన భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. 22 రోజుల పాటు క్లైమాక్స్ వార్ సీక్వెన్స్ షూటింగ్ చేయనున్నారు. ఈ యుద్ధ సన్నివేశాలు సినిమాకి హైలైట్ అవుతాయని యూనిట్ సభ్యుల సమాచారం.
జూలై 4 నుండి మూడో షెడ్యూల్ జార్జియాలో జరగనుంది. ఈ షెడ్యూల్లో క్లైమాక్స్‌ను చిత్రీకరిస్తున్నాం. ఈ భారీ షెడ్యూల్‌లో శాతవాహన సైనికులకు, గ్రీకు సైనికులకు మధ్యజరిగే పోరాట సన్నివేశాలుంటాయి. జార్జియాలో మౌంట్ కజ్ బెగ్ పర్వతం వద్ద చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రాంతం రష్యాకు చాలా దగ్గరగా ఉంటుంది. 1000 మంది సైనికులు, 200 గుర్రాలు, 20 రథాలతో క్లైమాక్స్ ను భారీగా చిత్రీకరిస్తున్నాం. నందమూరి బాలకృష్ణగారు మరో రెండు రోజుల్లో చిత్రీకరణలో పాల్గొంటారట

మొరాకోలోనూ, ఇండియాలో చిత్రీకరించిన రెండు షెడ్యూళ్లలోనూ బాలయ్య యుద్ధమే చేశారు. ఒకటవ శతాబ్దానికి చెందిన ఈ సన్నివేశాలను చిత్రీకరించడానికి క్రిష్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇప్పటికే మొరాకోలో తీసిన ఫైటింగ్ ఎపిసోడ్.. ఇంటర్వెల్ సందర్భంగా వచ్చే యుద్ధం అని తెలుస్తోంది. ఇక హైద్రాబాద్ లో భారీనౌక సెట్ వేసి తీసిన సన్నివేశాలు.. సినిమాకు ఓపెనింగ్ సీక్వెన్స్ గా రానున్నాయి. అంటే ఓపెనింగ్.. ఇంటర్వెల్.. క్లైమాక్స్ షూటింగ్ లు పూర్తయిపోతాయన్న మాట.
నిజానికి క్రిష్ కు జార్జియా విపరీతంగా నచ్చేసింది. అక్కడి ప్రదేశాలు పాత కాలపు సీన్స్ ను తీసేందుకు.. చారిత్రక యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించేందుకు అత్యంత అనువుగా ఉండడమే ఇందుకు కారణం. వరుణ్ తేజ్ తో తీయాలని తలపెట్టిన రాయబారి పట్టాలెక్కితే.. ఆ మూవీ షూటింగ్ కూడా ఇక్కడే జరిగేది. ఇప్పుడు బాలకృష్ణను కూడా జార్జియా తీసుకెళుతూ.. అక్కడ మైదానపు ప్రాంతంపై తన ఇష్టాన్ని చాటుకున్నాడు క్రిష్.
ఇక మిగిలింది రాజ కోటకు సంబంధించిన ఎపిసోడ్స్ మాత్రమే. త్వరలో అది కూడా పూర్తి చేసేసి.. గ్రాఫిక్ వర్క్ కి వెళ్లనునంది యూనిట్. అసలు వీఎఫ్ఎక్స్ కోసమే.. ఈ సన్నివేశాలను ముందే తీసేస్తున్నారు. ఈ లెక్కన సంక్రాంతికి రిలీజ్ కావడం.. శాతకర్ణికి పెద్ద కష్టమేం కాదు. బాలకృష్ణ సరసన శ్రియ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని జాగర్లమూడి సాయిబాబు సమర్పణలో వై.రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రియ రాణిగా, ఇద్దరు పిల్లల తల్లిగా కనిపిస్తుందని సమాచారం.