»   » బాలయ్య ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ టాక్ ఏంటి? హైలెట్స్ ఇవి, మైనస్ అదే?

బాలయ్య ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ టాక్ ఏంటి? హైలెట్స్ ఇవి, మైనస్ అదే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అఖండ భారతదేశాన్ని పరిపాలించిన ఏకైక చక్రవర్తి "శాతకర్ణి" జీవితం ఆధారంగా తెరకెక్కిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం "గౌతమిపుత్ర శాతకర్ణి" భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది..తెల్లవారు జామున నుండే చాల చోట్ల బినెఫిట్ షోస్ తో అభిమానులను ఆనందపరుస్తోంది.

భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన శాతకర్ణి కథాంశంతో రూపొందడంతో అటు అభిమానులే కాదు ఇటు సగటు ప్రేక్షకుల్లోనూ సినిమాపై అమితాశక్తి నెలకొంది. సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకొచ్చిన ఈ చిత్రం స్పెషల్ షోను ఫ్యాన్స్ కోసం ఈరోజు ప్రదర్శిస్తున్నారు. ఈ షోకి నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు అభిమానులతో కలిసి సినిమాను చూస్తున్నారు.


ఇక చిత్రం టాక్ ఎలా ఉందంటే..శాతకర్ణిగా బాలకృష్ణ గ్రాండ్ ఎంట్రీ అదిరిపోయింది...బాలయ్య ఎంట్రీ తో థియేటర్స్ దద్దరిల్లింది ..అలాగే యుద్ధసన్నివేశం లో మొదలైన ఫస్ ఫైట్ లో విజువల్స్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. యుద్ధ ఫైట్ తర్వాత శాతకర్ణి భార్య వశిష్టి దేవిగా శ్రియ చాల అందంగా కనిపించింది..శ్రీయ - బాలకృష్ణ ల మధ్య వచ్చే ఏకిమీడా రొమాంటిక్ సాంగ్ అదిరిపోయింది.


Gautamiputra Satakarni benefit show talk

ఇక ఈ చిత్రం కథా, కథనం ఆకట్టుకునేలా డిజైన్ చేసారు క్రిష్. ముఖ్యంగా బుర్రా సాయిమాధవ్‌ రాసిన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా చెప్తున్నారు. శాతకర్ణి పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయాడని.. యుద్ధ సన్నివేశాలు చాలా రిచ్‌గా తెరకెక్కించారని అంటున్నారు. చిత్రంలోని ఎమోషన్స్ ఆయా సన్నివేశాలకు మరింత బలాన్నిచ్చాయి. ఇక విజువల్‌ ఎఫెక్ట్స్‌ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలు వస్తున్నాయి. డైరక్టర్ గా క్రిష్‌ మరో మెట్టు ఎక్కారని, టేకింగ్‌, కథనం నడిపిన తీరు చాలా బాగుందంటున్నారు.


శాతకర్ణి జీవితం బుర్ర కథ చెప్పే పాత్రలో కన్నడ సూపర్ స్టార్ రాజ్‌కుమార్ కనిపించి అలరించారు. గ్రీకు రాజు నహాపనతో శాతకర్ణి చేసే యుద్ధం సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఫస్ట్ హాఫ్ అంత యుద్దాలు , గ్రాఫిక్స్ తో ఆకట్టుకుంది...బాలయ్య పోరాట సన్నివేశాలను అభిమానులు ఎంజాయ్ చేసారు..ఇక సెకండ్ హాఫ్ కూడా ఆకట్టుకునే రీతిలో ఉంది. శ్రియ, హేమ మాలిని పాత్రలు చాలా స్ట్రాంగ్ గా ఉండి కథకు కలిసివచ్చేలా సాగాయి. సాహో శాతకర్ణి అంటున్నారు.


అయితే సినిమాలో ఎక్కువ వార్ సీన్స్ ఉన్నాయని అవే కాస్తంత ఇబ్బందిగా ఉన్నాయంటున్నారు. , అయితే చరిత్ర ప్రకారం శాతకర్ణి నిజ జీవితంలోనూ ఒక యుద్దం తర్వాత మరొకటి చేసుకుంటూ వెళ్లారని, అందుకే సినిమాలో అన్ని వార్ సీన్స్ పెట్టి ఉండవచ్చు. ఇక బాలయ్య వయస్సు ఎంత మేకప్ తో కవర్ చేసినా చాలా చోట్ల కనపడి పోయింది. అంతేకాకుండా...కొన్ని వార్ షాట్లు,..అదే యుద్దం సీన్ లో రిపీట్ గా వాడారు.


ఇవన్నీ ప్రక్కన పెడితే తెలుగువాడి గొప్పతనాన్ని ప్రపంచం నలుమూలలా గర్వంగా చెప్పుకునేలా...బడ్జెట్ పరిమితులతో(ఇలాంటి హిస్టరీ చిత్రాలకు చాలా ఖర్చు అవుతుంది), అతి తక్కువ సమయంలో తీసి మన ముందించిన దర్శకుడు క్రిష్ ని ఎంత పొగిడినా తక్కువే. అలాగే ఈ సమయంలో ఇలాంటి సినిమా చేయాలని ముందుకొచ్చి శాతకర్ణి పాత్రలో జీవించిన బాలయ్య గ్రేట్.


రివ్యూ మరికొద్ది సేపట్లో...

English summary
Gautamiputra Satakarni boasts an ensemble cast in the form of Balakrishna, Shriya Saran, Hema Malini and few others. Made on a limited budget in a short span of time, the film is predominantly shot in Morrocco and Georgia.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu