»   »  ‘పెన్సిల్’ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన గౌతం మీనన్ (ఫోటోస్)

‘పెన్సిల్’ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన గౌతం మీనన్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జి.వి.ప్రకాష్‌, శ్రీదివ్య జంటగా తెరకెక్కుతునప్న యూత్‌ఫుల్‌ థ్రిల్లర్‌ 'పెన్సిల్‌'. తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రానికి మణి నాగరాజ్ దర్శకుడు. మణి నాగరాజ్ గతంలో గౌతమ్‌ మీనన్‌ వద్ద మన్మథ, చెలి, రాఘవన్‌, ఘర్షణ చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసారు.

ఎం.పురుషోత్తం సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలను పంపిణీ చేసిన సక్సెస్‌ఫుల్‌ డిస్ట్రిబ్యూటర్‌ జి.హరి నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ ఈరోజు ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ చేతులమీదుగా విడుదలైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా నిర్మాత జి.హరి మాట్లాడుతూ - ''పంపిణీదారుడుగా ఎన్నో సక్సెస్‌ఫుల్‌ చిత్రాలు చేసిన నేను ఈ సబ్జెక్ట్‌ విని చాలా ఇన్‌స్పైర్‌ అయ్యాను. ఫస్ట్‌ స్టాండర్డ్‌ నుంచి ఇంజనీరింగ్‌ వరకు విద్య నందించే ఇంటర్నేషనల్‌ స్కూల్‌, కాలేజీ నేపథ్యంలో జరిగే కథ ఇది. యూత్‌ఫుల్‌గా సాగే ఈ కథలో ఒక థ్రిల్లింగ్‌ ఎలిమెంట్‌ కూడా వుంటుంది. డెఫినెట్‌గా తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా యూత్‌కి నచ్చుతుందన్న కాన్ఫిడెన్స్‌తో ఫస్ట్‌ టైమ్‌ నేను తెలుగులో ఈ సినిమాని ప్రొడ్యూస్‌ చేస్తున్నాను. ఈ సమ్మర్‌కి అందర్నీ ఎంటర్‌టైన్‌ చేసే మంచి సినిమా అవుతుంది. జి.వి.ప్రకాష్‌ ఈ సినిమాతో మంచి హీరో అవుతారు.

శ్రీదివ్య

శ్రీదివ్య


శ్రీదివ్యకి మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుందని అంటున్నారు. ఈ చిత్రానికి శశాంక్‌ వెన్నెలకంటి మాటలు రాయగా, జి.వి.ప్రకాష్‌ ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ అందించారని చిత్ర యూనిట్ తెలిపారు.

టాప్ టెక్నీషియన్స్

టాప్ టెక్నీషియన్స్


'అత్తారింటికి దారేది' ఫేమ్‌ శ్రీమణి అద్భుతమైన పాటలు రాశారు. అలాగే గోపీ అమర్‌నాథ్‌ సినిమాటోగ్రఫీ, ఆంటోని ఎడిటింగ్‌, రాజీవన్‌ ఆర్ట్‌.. ఇలా ఈ చిత్రానికి అందరూ టాప్‌ టెక్నీషియన్స్‌ పనిచేస్తున్నారు.

షూటింగ్

షూటింగ్


ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ని ప్రముఖ ఐ.టి. కంపెనీ హెచ్‌సిఎల్‌ ఆధ్వర్వంలో నడుస్తున్న ఎస్‌.ఎస్‌.ఎన్‌. కాలేజీలో ఫస్ట్‌ టైమ్‌ చేయడం జరిగింది. అలాగే జపాన్‌లో కొంత పార్ట్‌ను షూట్ చెయ్యడం జరిగింది. ఈ చిత్రానికి సంబంధించి టోటల్‌గా షూటింగ్‌ పూర్తయిందని తెలిపారు.

నటీనటులు

నటీనటులు


జి.వి.ప్రకాష్‌కుమార్‌, శ్రీదివ్య జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో షరీఖ్‌ హాసన్‌, విటివి గణేష్‌, ఊర్వశి, గజేంద్రన్‌, అభిషేక్‌ శంకర్‌, ప్రియా మోష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

తెరవెనక

తెరవెనక


ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌, సినిమాటోగ్రఫీ: గోపీ అమర్‌నాథ్‌, ఎడిటింగ్‌: ఆంటోనీ, ఆర్ట్‌: రాజీవన్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: శ్రీమణి, నిర్మాణ నిర్వహణ: వడ్డీ రామానుజం, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మణి నాగరాజ్‌

English summary
Director Gautham Menon Launches first look of Pencil.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu