»   » అల్లు అర్జున్, శింబుతో గౌతం మీనన్ బాహుభాషా చిత్రం

అల్లు అర్జున్, శింబుతో గౌతం మీనన్ బాహుభాషా చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ లో ప్రముఖ ఫిల్మ్ మేకర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న గౌతం మీనన్ త్వరలో భారీ ప్రాజెక్టు మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాడు. సౌత్ లో నాలుగు బాషల ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపులర్ స్టార్స్ అయిన అల్లు అర్జున్ (తెలుగు), శింబు (తమిళం), పునీత్ రాజ్ కుమార్ (కన్నడ), పహాద్ ఫాజిల్ (మలయాళం)లతో బహుబాషా చిత్రాన్ని తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

మూడు లేదా 4 బాషల్లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ఇంకా చర్చల దశలోనే ఉంది. అన్ని ఓకే అయితే వచ్చే ఏడాది ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది. ఒకే సినిమాలో నలుగురు హీరోలు కలిసి నటించడం సినిమాకు బాగా ప్లస్సవుతుందని భావిస్తున్నారు.

పునీత్ రాజ్ కుమార్, గౌతం మీనన్ గతంలో 7అప్ యాడ్ కాంపెయిన్ లో పాల్గొన్నారు. ఈ సమయంలో మీతో సినిమా చేయాలంటూ తన మనసులోని మాట గౌతం మీనన్ ముందు బయట పెట్టాడు పునీత్. అప్పటి నుండి ఇద్దరూ టచ్ లో ఉంటున్నారు. గౌతం మీనన్, పహాద్ ఫాజిల్ కలసి పని చేయాలని గతంలోనే నిర్ణయించుకున్నప్పటికీ ఇప్పటికీ ఇంకా వీలు కాలేదు.

Gautham Menon Plans Multilingual Film With Four Stars

ఈ ఇద్దరితో పాటు శింబు, అల్లు అర్జున్ ను కలుపుకుని సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాడు. నలుగురు స్నేహితుల చుట్టూ ఈ కథ తిరుగుతుందని, పెళ్లిళ్లు అయ్యాక చాలా ఏళ్ల తర్వాత కలిసిన నలుగురు స్నేహితులు ఒక విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో జరిగే సంఘటనలతో సినిమా ఉంటుందట.

తమిళం, మళయాలం వెర్షన్ లో నిర్మాణ బాధ్యతలు గౌతం మీననే చూసుకోవాలని అంనుకుంటున్నాడట. కన్నడలో పునీత్ రాజ్ కుమార్ నిర్మాణ బాధ్యతల్లో పాలు పంచుకునే అవకాశం ఉంది. తెలుగులో ప్రముఖ నిర్మాత ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు చూసుకుంటాడని టాక్.

మరో వైపు గౌతం మీనన్, రామ్ చరణ్ కూడా కలిసి పని చేయాలనుకుంటున్నారు. రామ్ చరణ్ త్వరలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తమిళ చిత్రం ‘తాని ఎరువన్' సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. దీని తర్వాత గౌతం మీనన్, రామ్ చరణ్ ప్రాజక్టు మొదలయ్యే అవకాశం ఉంది.

English summary
Filmmaker Gautham Vasudev Menon, who is on the brink of wrapping up his Tamil-Telugu bilingual film "Achcham Yenbadhu Madamaiyada", plans to start a multi-lingual project with popular southern stars such as Puneeth Rajkumar, Fahadh Faasil, Simbu and Allu Arjun.
Please Wait while comments are loading...