»   » సెకండ్ షో దర్శకుడిని పెళ్లాడిన హీరోయిన్ (ఫోటోస్)

సెకండ్ షో దర్శకుడిని పెళ్లాడిన హీరోయిన్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొచ్చి: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ప్రేమ వివాహాల జోరు బాగా పెరిగింది. ముఖ్యంగా తెలుగులో ఇలాంటి కాస్త తక్కువే అయినా మళయాలం, తమిళంలో ఎక్కువే. ఈ క్రమంలోనే మలయాళ హీరోయిన్ గౌతమి నాయర్, సెకండ్ షో అనే మలయాళ సినిమా దర్శకుడు శ్రీనాథ్ రాజేంద్రన్ పెళ్లి ద్వారా ఏకమయ్యారు.

గౌతమి నాయర్ హోమ్ టౌన్ అయిన అలప్పిలో పూర్తి ప్రైవేట్ సెర్మనీగా వీరి వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

అభిమానులకు సర్పైజ్

అభిమానులకు సర్పైజ్

ఇంత కాలం వీరు తమ ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగానే కొనసాగించారు. అయితే ఉన్నట్టుండి వీరి వ్యవహారం వెలుగులోకి రావడం, పెళ్లి చేసుకోవడంతో అభిమానులంతా సర్పైజ్ అయ్యారు.

సెకండ్ షోలో మొదలైన ప్రేమ

సెకండ్ షోలో మొదలైన ప్రేమ

శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ‘సెకండ్ షో' సినిమాలో గౌతమి నాయర్ హీరోయిన్ గా నటించింది. మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో హీరో. ఈ ముగ్గురికి ఇది మొదటి సినిమానే. ఈ క్రమంలో శ్రీనాథ్ రాజేంద్రన్ తో గౌతమి నాయర్ కనెక్ట్ అయిపోయింది.

బయట పడలేదు

బయట పడలేదు

అయితే తమ ప్రేమ విషయం బయట పడకుండా ఇద్దరూ ఈ విషయాన్ని ఇంతకాలం గోప్యంగా ఉంచారు. శ్రీనాథ్ రజేంద్రన్ తర్వాతి మూవీ Koothara లోనూ గౌతమి నాయర్ హీరోయిన్ గా నటించింది.

సినిమాలకు దూరం

సినిమాలకు దూరం

పెళ్లితో గౌతమి నాయర్ సినిమాలకు దూరం అవ్వాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఆమె తన హయ్యర్ స్టడీస్ మీద దృష్టి పెట్టింది.

English summary
Gauthami Nair, the young actress tied the knot with her longtime boyfriend, the young film-maker Srinath Rajendran. Gauthami and Srinath entered the wedlock in a private ceremony held in the bride's hometown, Alappuzha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu