For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వాళ్లంతా ఇష్టంతోనే చేస్తున్నారు..అలాంటోళ్లే బలౌతున్నారు:కాస్టింగ్ కౌచ్‌పై గాయత్రి షాకింగ్ కామెంట్స్

  By Manoj
  |

  గాయత్రి గుప్తా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు. 'ఫిదా' సినిమాలో సంప్రదాయబద్దంగా కనిపించిన ఈ తెలుగమ్మాయి మంచి నటనతో ఆకట్టుకుంది. అయినప్పటికీ మొదట్లో ఈమె గురించి ఎవరికీ తెలిసేది కాదు.. కానీ, తన బోల్డ్ స్టేట్‌మెంట్లతో మాత్రం బాగా పాపులర్ అయింది. తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటోన్న గాయత్రి.. తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. తాజాగా ఆమె హీరోయిన్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆమె ఏమంది.? వివరాల్లోకి వెళితే....

   ఎక్కడ చూసినా గాయత్రి గుప్తానే

  ఎక్కడ చూసినా గాయత్రి గుప్తానే

  గాయత్రి గుప్తా మొదట టీవీ ప్రోగ్రామ్‌ల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆమె యాంకర్‌గా చేసిన రోజుల్లో బాగా పాపులర్ అయింది. అలాగే, పలు చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ముఖ్యంగా గాయత్రి ‘ఫిదా', ‘ఐస్‌క్రీమ్ 2', ‘కొబ్బరిమట్ట', ‘మిఠాయి' సహా ఎన్నో చిత్రాల్లో నటించింది. అలాగే, ‘పెళ్లికి ముందు', ‘సీత ఆన్ ద రోడ్' అనే షార్ట్ ఫిల్మ్ కూడా చేసింది.

  కాస్టింగ్ కౌచ్ అంటే గాయత్రే గుర్తొస్తుంది

  కాస్టింగ్ కౌచ్ అంటే గాయత్రే గుర్తొస్తుంది

  టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ అనే అంశం ఎంతటి కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిని శ్రీరెడ్డి తెరపైకి తీసుకువచ్చిందని చాలా మంది అనుకుంటారు. కానీ, ఆమె కంటే ముందే కాస్టింగ్ కౌచ్‌పై గాయత్రి గుప్తా పోరాటం ప్రారంభించింది. అవకాశాలు ఇప్పిస్తామని తనను చాలా మంది మోసం చేశారని చెప్పి అప్పట్లో ప్రకంపనలు రేపింది.

   వంద రోజులు సెక్స్ లేకుండా ఉండగలవా..?

  వంద రోజులు సెక్స్ లేకుండా ఉండగలవా..?

  గాయత్రి గుప్తా కొద్ది రోజుల క్రితం ‘బిగ్ బాస్' నిర్వహకులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘నాకు ‘బిగ్ బాస్' సీజన్ -2లో ఆఫర్ వచ్చింది. అందుకోసం నేను స్టార్ మా వాళ్లతో మాట్లాడడానికి కూడా వెళ్లాను. అప్పుడు నన్ను బిగ్ బాస్ షో వాళ్లు ‘హౌస్‌లోకి వస్తే వంద రోజులు సెక్స్ లేకుండా ఉండగలవా..? నీ సెక్స్ జీవితాన్ని ఎలా మేనేజ్ చేసుకుంటావ'ని ప్రశ్నించారని చెప్పుకొచ్చింది.

  ఆ ఒక్క దానితో దేశ వ్యాప్తంగా ఫేమస్

  ఆ ఒక్క దానితో దేశ వ్యాప్తంగా ఫేమస్

  బిగ్ బాస్ షో నిర్వహకుల చేస్తున్న పోరాటానికి మరో యాంకర్ కూడా తోడవడంతో గాయత్రి గుప్తా రెట్టించిన ఉత్సాహంతో పని చేసింది. ఆ సమయంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గరకు వెళ్లి మరీ బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలని పోరాటం చేసింది. దీంతో గాయత్రి దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఆ సమయంలో పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్లిన విషయం తెలిసిందే.

  కాస్టింగ్ కౌచ్‌పై గాయత్రి షాకింగ్ కామెంట్స్

  కాస్టింగ్ కౌచ్‌పై గాయత్రి షాకింగ్ కామెంట్స్

  తాజాగా గాయత్రి గుప్తా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో భాగంగా ఆమె కాస్టింగ్ కౌచ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందన్న విషయం ఎప్పటి నుంచో చెబుతున్నా. అయితే, చాలా మంది నటిమణులు ఇష్టంతోనే చేస్తున్నారు. కొందరు అవసరాల కోసం చేస్తున్నారు. వీళ్లలో అమాయకపు అమ్మాయిలే బలవుతున్నారు' అని చెప్పుకొచ్చింది.

  Bigg Boss Telugu 3 : Case Filed On Bigg Boss Telugu By Gayathri Gupta || Filmibeat Telugu
  అందరికీ ఒక ఫ్లాట్‌ఫాం దొరికింది

  అందరికీ ఒక ఫ్లాట్‌ఫాం దొరికింది

  కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ‘గతంలో నేను చేసిన పోరాటానికి అంతగా సహకారం అందలేదు. తర్వాత మరికొందరు నాలా పోరాడడం వల్లే ఇండస్ట్రీ స్పందించింది. ఇందుకోసం ఓ కమిటీని కూడా వేశారు. ఇప్పుడు చాలా మంది బాధితులకు అది ఒక ఫ్లాట్‌ఫాం అయింది. దీంతో చాలా మంది నేరుగా వెళ్లి ఫిర్యాదు చేయగలుగుతున్నారు' అని గాయత్రి వెల్లడించింది.

  English summary
  Gayathri Gupta is an Indian Telugu language actress and TV presenter. She is known for her progressive and liberal views. She is known for her debates in Telugu News Channels about casting couch issue in Tollywood. She is known to be straight forward and frank.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X