»   » గీతా ఆర్ట్స్‌ బ్యానర్లో మారుతి మరో సినిమా

గీతా ఆర్ట్స్‌ బ్యానర్లో మారుతి మరో సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తక్కువ కాలంలోనే తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మారుతి. అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వంలో వచ్చిన 'కొత్త జంట' విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ....'కొత్త జంట' చిత్రం విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు. దర్శకుడి మారుతి వల్లనే ఈచిత్రం విజయం సాధించిందని తెలిపారు. మారుతి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్లు అల్లు అరవింద్ తెలిపారు.

Geeta Arts another film in Maruthi’s direction

అల్లు శిరీష్‌, రెజినా జంటగా మారుతి దర్శకత్వంలో కొత్త జంట తెరకెక్కింది. గీతాఆర్ట్స్ పతాకంపై నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నివాసు నిర్మించారు. ఇందులో మధురిమ గెస్ట్‌రోల్‌ పోషించింది. సప్తగిరి, ప్రవీణ్‌, మధు, రవి, సాయి, పోసాని, రావురమేష్‌, ఆహుతిప్రసాద్‌ నటించారు.

ఈ చిత్రానికి జె.బి.మ్యూజిక్‌ అందించారు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసారు. లవ్‌, ఎమోషన్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ కావడంతో మంచి ఫలితాలు వచ్చాయి. ఈ చిత్రానికి ఎడిటింగ్‌: ఉద్దవ్‌, ఆర్ట్‌: రమణ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.కె.ఎన్‌., సినిమాటోగ్రఫీః రిచర్డ్‌ ప్రసాద్‌.

English summary

 Producer Allu Aravind said that he was quite happy with Maruthi’s work in Kotta Janta, and will soon be making yet another film in his direction.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu