»   » నేనే పోలీసులకు అప్పగిస్తా: నందు డ్రగ్స్ ఇష్యూపై సింగర్ గీతా మాధురి

నేనే పోలీసులకు అప్పగిస్తా: నందు డ్రగ్స్ ఇష్యూపై సింగర్ గీతా మాధురి

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో యువ నటుడు, సింగర్ గీతా మాధురి భర్త నందు పేరు మీడియాలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, పోలీసుల నుండి ఎలాంటి నోటీసులు అందలేదని నందు స్పష్టం చేశారు.

  తన భర్త పేరు వినిపించడంపై సింగర్ గీతా మాధురి స్పదించారు. నందు డ్రగ్స్ వాడుతున్నాడంటే తాను అస్సలు నమ్మును. నందుకు ఎటువంటి చెడు అలవాట్లూ లేవు, ఒక వేళ డ్రగ్స్ తీసుకునే అలవాటే ఉంటే, తనకు తప్పకుండా తెలిసేదని ఆమె తెలిపారు.

  నేనే పోలీసులకు అప్పగిస్తా

  నేనే పోలీసులకు అప్పగిస్తా

  నందు ఒక వేళ డ్రగ్స్ వాడి ఉంటే, పోలీసుల నుండి నోటీసులు వచ్చి ఉంటే.... నేనే స్వయంగా విచారణ నిమిత్తం నందును పోలీసులకు అప్పగిస్తాను. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరుగలేదు. నా భర్త అమాయకుడు, ఆయనపై లేని పోని వార్తలు ప్రసారం చేయవద్దు, ఇప్పుడిప్పుడే నటుడిగా ఎదుగుతున్న అతడి కెరీర్ మీద ఇలాంటి వార్తలు చాలా ప్రభావం చూపుతాయి అని గీతా మాధురి వాపోయారు.

  డ్రగ్స్ సినీపరిశ్రమ మొత్తానికి ఆపాదించవద్దు

  డ్రగ్స్ సినీపరిశ్రమ మొత్తానికి ఆపాదించవద్దు

  డ్ర‌గ్స్ వ్య‌వ‌హారాన్ని సినీ పరిశ్రమ మొత్తానికి అంటగట్టకూడ‌ద‌ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా కోరాడు. ఎవ‌రైనా న‌టులు డ్రగ్స్ వాడినా, ఇంకేదైనా తప్పుడు పని చేసినా అది వారి వ్య‌క్తిగ‌త విష‌యానికి సంబంధించింద‌ని అన్నాడు.

  జాగ్రత్తగా ఉండండి

  జాగ్రత్తగా ఉండండి

  సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉండేవారు చెడు అల‌వాట్ల‌కు లోను కాకుండా ఎంతో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఈ సందర్భంగా మా అధ్యక్షుడు శివాజీ అన్నారు.

  డ్రగ్స్ వాడేది కేవలం సినిమా వారేనా?

  డ్రగ్స్ వాడేది కేవలం సినిమా వారేనా?

  సినిమా వారు చిన్న త‌ప్పు చేసినా మీడియాలో బ్రేకింగ్ న్యూస్ గా చూపిస్తార‌ు. సినిమా వారు ఒక్కరే డ్రగ్స్ తీసుకుంటున్నారా? రాజకీయ నాయకులు, బిజినెస్‌మేన్ల పిల్లలు, చివరకు రిక్షావాళ్ల పిల్లలు కూడా ఇలాంటి చేస్తున్నారని, కేవలం సినిమా ఇండస్ట్రీనే టార్గెట్ చేయడం మంచిది కాదని నటి జీవిత అన్నారు. మారిపోయిన కల్చరే ఇలాంటి అలవాట్లకు కారణం అవుతోంది. దీన్ని అరికట్టే ప్రయత్నం చేయాలని ఆమె అన్నారు.

  డ్రగ్స్ కు బానిసయ్యా, ఇపుడు మారాను

  డ్రగ్స్ కు బానిసయ్యా, ఇపుడు మారాను

  గతంలో తాను డ్రగ్స్‌కు బానిసయ్యాను. అప్పటికీ తనకు ఇంకా పెళ్లి కాలేదు. దాదాపు నా జీవితం నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. డ్రగ్స్ నుండి బయటపడేందుకు మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో దోహదపడ్డాయని నటుడు భాను చందర్ గుర్తు చేసుకున్నారు. దయచేసి ఎవరూ డ్రగ్స్ జోలికి వెళ్లకండి. క్రమశిక్షణతో ఉంటే మనకు కావాల్సినవన్నీ అవే వస్తాయి. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా క్రమశిక్షణ అలవడుతుందని భాను చందర్ తెలిపారు.

  English summary
  Geetha Madhuri denies Nandu's connection with drugs case. Geetha Madhuri issued a clarification while speaking to media regarding this issue. 'My Husband has never consumed drugs. Media reports projecting links between Nandu & Drug Peddlers are false. Nandu isn't such a person who would be addicted to drugs. Media need to verify facts before reporting,' she advised.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more