»   » చిరు చిత్రం రీమేక్ లో జెనీలియా

చిరు చిత్రం రీమేక్ లో జెనీలియా

Posted By:
Subscribe to Filmibeat Telugu
Genelia
ముంబై: జెనీలియా మళ్లీ వెండితెరపై తళుక్కుమని మెరవనుంది. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న 'జై హో' సినిమాలో ఆమె ఓ ప్రత్యేక పాత్రలో నటించింది. ఇప్పటికే ఆమె మీద వచ్చే సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో డైసీ షా, సనా ఖాన్‌ హీరోలుగా నటిస్తున్నప్పటికీ ఓ ప్రాధాన్యం ఉన్న పాత్ర కోసం జెనీలియాను సొహైల్‌ ఖాన్‌ అడగడం... ఆమె కూడా లేదనకుండా నటించడం చకచకా జరిగిపోయాయి.


జెనీలియా పాత్ర వీల్‌ఛైర్‌కి మాత్రమే పరిమితమైనప్పటికీ ప్రతి సన్నివేశంలో జెన్నీ నటన మాత్రం సెట్‌లో ఉన్న వారందర్నీ అచ్చెరువొందేలా చేసిందని చిత్రవర్గాలు తెలిపాయి. జెనీలియా నటనకు అందరూ 'జై హో' అన్నారట. తెలుగులో వచ్చిన 'స్టాలిన్‌' సినిమాకు రీమేక్‌ ఇది

ఈ చిత్రం తెలుగులో మెగాస్టార్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'స్టాలిన్' చిత్రానికి జిరాక్స్ కాపీ. స్టాలిన్ చిత్రాన్ని ఉన్నదున్నట్లు సల్మాన్ హీరోగా 'జైహో' పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సల్మాన్ సోదరుడు సొహైల్ ఖాన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. తొలుత ఈచిత్రానికి మెంటల్ అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ సూచన మేరకు 'జైహో'గా మార్చారు.

మరో ప్రక్క 2005లో బోనీకపూర్ నిర్మించిన 'నో ఎంట్రీ' అనే బాలీవుడ్ చిత్రంలో ప్లేబాయ్‌గా అలరించిన సల్మాన్ ఖాన్....ఆ చిత్రానికి సీక్వెల్‌ చేయబోతున్నాడు. 'నో ఎంట్రీ మై ఎంట్రీ' పేరుతో బోనీకపూర్ ఈచిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. 2014లో ఈచిత్రం సెట్స్ పైకి వెళ్లబోతోంది.

ఈ సినిమాలో సల్మాన్ 10 మంది హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడని టాక్. ఈ చిత్రంలో అనిల్ కపూర్ కూడా ముఖ్యపాత్రలో నటించబోతున్నాడు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో కూడా సల్మాన్ ప్లేబాయ్ పాత్రలో కనిపించబోతున్నాడు.

English summary
Genelia D’souza has been missing from the silver screen for quite some now, but Genny fans here’s some good news. Ms. D’Souza Deshmukh is ready for films and is all set to comeback. The Deshmukh bahu will do a cameo in Salman’s upcoming film Jai Ho which is being directed by Sallu’s brother Sohail Khan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu