»   » రామ్, జెనీలియా కాంబినేషన్ మళ్ళీ 'రెడీ'!!

రామ్, జెనీలియా కాంబినేషన్ మళ్ళీ 'రెడీ'!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'రెడీ' కాంబినేషన్ రామ్, జెనీలియా మళ్ళీ జతకట్టనున్నారు. 'కిక్' వంటి హిట్టుతో మళ్ళీ నిలబడ్డ స్టార్ డైరక్టర్ సురేంద్రరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇక మొదట ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు ఇలియానాను అనుకున్నారు. అయితే అనుకోని కొన్ని మార్పులుతో జెనీలియా వచ్చి చేరింది. 'స్రవంతి' రవికిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ క్యారెక్టర్..చిన్న పిల్లలా అల్లరిగా ప్రవర్తించే అమ్మాయి పాత్ర. దాంతో 'బొమ్మరిల్లు' హాసినిని గుర్తు చేసుకుని జెనీలియాను తీసుకున్నట్లు చెప్తున్నారు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. వర్కింగ్ టైటిల్ గా 'టామ్ అండ్ జెర్రీ' అని వ్యవహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రమని, ఫారిన్ లో ఎక్కువ భాగం షూటింగ్ జరగనుందని చెప్తున్నారు. కిక్ లా కామిడీ ఎంటర్టైనర్ గా రూపొందే సినిమా గాబట్టి మరో కిక్ తెలుగు సినిమాకి రానుందన్నమాట. ఇక రామ్ ప్రస్తుతం లక్ష్యం వాసు దర్శకత్వంలో రామ రామ కృష్ణ కృష్ణ అనే చిత్రంలో చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరో అర్జున్ కీలకపాత్రలో కనిపించనున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu