»   » జెనీలియాకు వరసగా రెండు చేదు అనుభవాలు

జెనీలియాకు వరసగా రెండు చేదు అనుభవాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

జెనీలియాకు రీసెంట్ గా రెండు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. యూటీవీలో ప్రసారమవుతున్న 'బిగ్‌స్విచ్‌' కార్యక్రమం నుంచి జెనీలియాను తప్పించారు. అలాగే రామ్ హీరోగా ప్రారంభం అయిన రామ్ అండ్ జెన్నీ చిత్రం ఆగిపోయింది. ప్రారంభం నుంచీ ఈ కార్యక్రమానికి జెనీలియానే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. అయితే త్వరలో ప్రారంభం కానున్న 'బిగ్‌ స్విచ్‌-2' కార్యక్రమానికి కూడా జెన్నీనే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుందని అందరూ భావించారు. కాని నిర్వాహకులు మాత్రం భిన్నంగా ఆలోచించారు. ఈసారి కొత్తవారితో కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నట్లు చెప్పి జెనీలియాకు షాక్‌ ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమం మునుపటికి భిన్నంగా ఉంటుందని, అందుకే కొత్తవారితో కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నట్లు యూటీవీ ప్రతినిధి నిల్‌ గాంధీ వెల్లడించారు.

గొప్పింటి పిల్లలు, పేదింటి పిల్లల నేపథ్యంలో సాగిన ఈ కార్యక్రమం మొదట్లో బాగానే అలరించినా రానురాను రేటింగ్స్ పడిపోయాయి.పోగ్రాం స్టార్టయిన ఏడాదిలోనే ఈ రేటింగ్స్ పడిపోవటానికి కారణాల గురించి చెబుతూ...'కార్యక్రమ నేపథ్యం(కాన్సెప్ట్‌) వ్యాఖ్యాతకంటే కూడా బాగా ఆకట్టుకుంది. అయితే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయామ'ని నిల్‌ పేర్కొన్నారు. అంటే ఇండైరక్ట్ గా జెనీలియా ఫెయిల్యూర్ అయిందనే చెప్తున్నట్లేగా. ఇక జెనీలియా ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ అనే చిత్రం చేస్తోంది. రామ్ చరణ్ హీరోగా చేస్తున్న ఆ చిత్రాన్ని నాగబాబు నిర్మిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu