రణ్‌బీర్‌ను కలుసుకునే ఛాన్స్ ఇదే...
దీనికోసం ఫుడ్‌పాండా.ఇన్ త్వరలో విడుదల కాబోయే రణ్‌బీర్ సినిమా 'బేషరం డీల్స్' పేరుతో అక్టోబరు 11 వరకు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి ఏడు గంటల మధ్య ప్రజలు ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలపై 15 శాతం నుంచి 50 శాతం తగ్గింపు లభిస్తుంది. అంగ్రీజీ ధాబా, చికాగో పిజ్జా, మాండరిన్ ఎక్స్‌ప్రెస్, యో చైనా, మస్త్ కలందర్ తదితర రెస్టారెంట్లలో ప్రజలు ఆహారం ఆరగించి ఈ ప్రత్యేక సదుపాయం పొందవచ్చు.
ఈ కార్యక్రమం జరిగే సమయంలో ప్రజలు వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేయడం ద్వారా బేషరం ఓచర్ కోడ్‌ని ఎంటర్ చేసే అవకాశాన్ని వెబ్‌సైట్ అందిస్తోంది. అయిదుగురికి రణ్‌బీర్ కపూర్‌ని కలుసుకునే అవకాశం లభిస్తుంది. రాక్ స్టార్, బర్ఫీ, యే జవానీ హై దివానీ చిత్రాలతో వరుస విజయాలు సొంతం చేసుకున్న బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ యే జవానీ హై దివానీ చిత్రంతో రూ. 100 కోట్లు వసూలు చేసే సత్తా ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేసాడట.
బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు సినిమాకు రూ. 15 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. రణబీర్ కపూర్ ప్రస్తుతం అభినవ్ కశ్యప్ దర్శకత్వంలో 'బేషరామ్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రూ. 15 కోట్లు తీసుకుంటున్నాడట. దీంతో పాటు 'రాయ్' అనే సినిమాకు కూడా కేమిట్ అయ్యాడు. 'రాయ్' చిత్రంలో రణబీర్ కపూర్ అర్జున్ రాంపాల్‌తో కలిసి నటిస్తున్నాడు. 'రాయ్' చిత్రానికి సోలో హీరో కాక పోయినా.....రెగ్యులర్‌గా తీసుకునే రూ. 15 కోట్లు చార్జ్ చేస్తున్నాడట రణబీర్. దీంతో పాటు ప్రాఫిట్స్‌లో షేర్ కూడా డిమాండ్ చేస్తున్నాడని వినికిడి.


Click it and Unblock the Notifications












