Just In
- 6 min ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 1 hr ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 2 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 2 hrs ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
Don't Miss!
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- News
ఓ ఎంపీ,ఓ ఎమ్మెల్యే... దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి పొలిటీషియన్లు వీరే...
- Finance
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్యూ 3 ఫలితాల కిక్ : 18% పెరిగిన నికర లాభం
- Lifestyle
ఈ పరోక్ష లక్షణాలు మీకు బిడ్డ పుట్టకపోవడానికి హెచ్చరిక కావచ్చు ... జాగ్రత్త ...!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సుడిగాలి సుధీర్ ఎంత చేయాలో అంత చేశాడు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్
బుల్లితెర కమెడియన్‌గా తనదైన మార్క్ చూపించిన సుడిగాలి సుధీర్ హీరో అవతారమెత్తిన సంగతి తెలిసిందే. సుడిగాలి సుధీర్ హీరోగా వచ్చిన తొలి సినిమా 'సాఫ్ట్‌వేర్ సుధీర్' ఈ రోజే (డిసెంబర్ 28) విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు తమ వంతుగా సపోర్ట్ చేస్తూ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను. వివరాల్లోకి పోతే..

హీరోగా సుడిగాలి సుధీర్..
శేఖర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం-1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్ రాజు నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రంతో సుడిగాలి సుధీర్ హీరోగా తెరంగేట్రం చేశాడు. ఈ సినిమాలో సుధీర్ సరసన 'రాజు గారి గది' ఫేమ్ ధన్యా బాలకృష్ణను హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ద్వారా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమయ్యారు.

వీడియో ద్వారా గెటప్ శ్రీను
ఈ నేపథ్యంలో తోటి నటుడు గెటప్ శ్రీను.. సుడిగాలి సుధీర్ తొలి సినిమా అందరూ చుడండి అంటూ వీడియో ద్వారా సందేశమిచ్చాడు. ఈ మేరకు సుడిగాలి సుధీర్ తొలి సినిమా సక్సెస్ కావాలని, బుల్లితెర లాగే వెండితెరపై కూడా సుధీర్ మార్క్ పడాలని కోరుకున్నాడు. ప్రేక్షకులంతా సపోర్ట్ చేసి అతన్ని పెద్ద హీరో చేయాలని కోరాడు.

ఆ అవకాశం మిస్..
తాను ఓ సినిమా షూటింగ్‌లో ఉండటం కారణంగా తన మిత్రుడు సుధీర్‌తో కలిసి ఫస్ట్ షో చూసే అవకాశం మిస్ అయ్యానని అన్నాడు గెటప్ శ్రీను. ఈ మేరకు చిన్న సినిమాలకు అందరూ సపోర్ట్ చేయండంటూ అభ్యర్థించాడు. ఈ వీడియోలో గెటప్ శ్రీనుతో పాటు నభా నటేష్, మహేష్ విట్టా కూడా కనిపించి తమ సపోర్ట్ తెలియజేశారు.

బ్యాచిలర్స్‌గా ఉన్నప్పటి నుంచే
అలాగే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్ గురించి ప్రస్తావించాడు గెటప్ శ్రీను. తాను, సుధీర్ బ్యాచిలర్స్‌గా ఉన్నప్పటి నుంచి మంచి స్నేహితులమని చెప్పాడు. సుధీర్ ఎప్పటికైనా మంచి యాక్టర్ అవుతాడని అనుకున్నానని, ఇప్పుడు హీరో అయ్యాడు కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాడని గెటప్ శ్రీను అన్నాడు.

ఎంత చేయాలో అంత చేశాడు
బుల్లితెరపై సుధీర్ ప్రయాణం ఎంతవరకూ చేయాలో అంతవరకూ చేశాడని, ఇక వెండితెరపై తనేంటో చూపించనున్నాడని గెటప్ శ్రీను అన్నాడు. బుల్లితెరపై క్లాప్స్ కొట్టే డాన్స్ చేసిన సుధీర్, వెండితెరపై విజిల్ కొట్టే డాన్స్ చేశాడని, అనుకున్నదానికి మించి సుధీర్ సక్సెస్ అవుతాడని భావిస్తున్నానని గెటప్ శ్రీను తెలిపాడు.