»   »  మంత్రి కుమారుడు హీరోగా డైరెక్టర్ మారుతి సినిమా!

మంత్రి కుమారుడు హీరోగా డైరెక్టర్ మారుతి సినిమా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా హీరో కావాలంటే కేవలం టాలెంటు ఉంటే ఏ మాత్రం సరిపోదు. సినిమా కుటుంబానికి చెందిన వారసత్వమో, పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉంటే తప్ప సినిమా అవకాశాలు రావడం కష్టమే. ఒక వేళ ఇవేవీ లేకుంటే సొంత డబ్బుతో సినిమా తీసుకునే శక్తి ఉండాలి. అలాంటి వారే హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు.

 Ghanta Sreenivas Rao son into Movies

ప్రస్తుతం సినిమా పరిశ్రమలో హీరోలుగా పరిచయం అవుతున్న యంగ్ హీరోల్లో ఎక్కువ మంది ఇలాంటి కేటగిరీకి చెందిన వారు. తాజాగా ఏపీ మంత్రి గంట శ్రీనివాసరావు తనయుడు రవితేజ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం.

కొత్త వారిని పరిచయం చేస్తూ మినిమమ్ గ్యారంటీ సినిమాలు తీయగలడన్న గుర్తింపు తెచ్చుకున్న మారుతి గంట తనయుడు రవితేజతో యూత్ ఫుల్ సినిమా తీయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం నానితో భలే భలే మగాడివోయ్ సినిమా తెరకెక్కిస్తున్న మారుతీ... ఆ తర్వాత గంటా రవితేజ డెబ్యూ మూవీకి పని చేస్తాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను గీతాఆర్ట్స్ బేనర్ నిర్మించబోతోందట.

English summary
According to source Ghanta Ravi teja son of AP minister Ganta Srinivasa Rao is entering into films as hero.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu