»   » అగ్ర హీరోల మధ్య శత్రుత్వం, చిరు-పవన్ గురించి... గిరిబాబు హాట్ కామెంట్!

అగ్ర హీరోల మధ్య శత్రుత్వం, చిరు-పవన్ గురించి... గిరిబాబు హాట్ కామెంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏ రంగంలో అయినా పోటీ సహజం. ఒక్కోసారి ఈ పోటీ కాస్త హద్దులు దాటి వైరుధ్యాలకు దారి తీయొచ్చు. ఒక్కోసారి ఆయా వ్యక్తుల ప్రమేయం లేకున్నప్పటికీ పక్కన ఉండే వ్యక్తులు వల్ల కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.

తెలుగు సీనియర్ నటుడు, నిర్మాత గిరిబాబు ఇటీవల ఓ వెబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ కాలంలో ఇండస్ట్రీలో అగ్ర హీరోల మధ్య వైరుధ్యాలు ఎలా ఉండేవి? లాంటి అంశాలపై ఆయన హాట్ కామెంట్ చేశారు.

ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మధ్య శత్రుత్వం ఉండేది

ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మధ్య శత్రుత్వం ఉండేది

ఒకప్పటి అగ్ర హీరోలు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ మధ్య శత్రుత్వం ఉండేదని సీనియర్ నటుడు గిరిబాబు అన్నారు. ఇదంతా వారి అభిమానుల వల్ల ఏర్పడిందేనని ఆయన చెప్పారు.

Chiranjeevi felicitated by T. Subbarami Reddy - Filmibeat Telugu
వ్యక్తిగతం కూడా

వ్యక్తిగతం కూడా

వ్యక్తిగతంగా కూడా కొన్ని విభేదాలు వీరి మధ్య ఉండేవని, తెలుగు సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ షిప్ట్ అయ్యే సమయంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య విభేదాలు వచ్చాయని ఆయన గుర్తు చేసుకున్నారు.

శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు

శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు

తెలుగు సినీ పరిశ్రమను అభివృద్ధి చేసే క్రమంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ విబేధాలు పక్కన పెట్టి కలిసిపోయారని, కాల క్రమంలో ఎన్టీఆర్, కృష్ణలు మంచి స్నేహితులయ్యారని తెలిపారు. రాజకీయాల్లో, సినిమా రంగంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరు... ఒకరి అవసరం మరొకరికి ఎప్పటికైనా ఉంటుందని గిరిబాబు తెలిపారు.

చిరంజీవికి అప్పుడే చెప్పా

చిరంజీవికి అప్పుడే చెప్పా

అప్పట్లో చిరంజీవితో సినిమాలు చేసినప్పుడే చెప్పాను. ఆయన పెద్ద స్టార్ అయిపోతాడని, అతడు మంచి నటుడు... డాన్సులు, ఫైట్లు నెం.1గా చేసే వాడు. వాటి ద్వారానే మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు అని గిరిబాబు అన్నారు.

చిరంజీవి పెళ్లి విషయంలో

చిరంజీవి పెళ్లి విషయంలో

అల్లు రామలింగయ్య కూతురు పెళ్లి విషయంలో కూడా చెప్పాను చిరంజీవి మంచి కుర్రాడని, మంచి ఆర్టిస్టు అవుతాడని, ఎలాంటి సందేహం లేకుండా పెళ్లి చేయొచ్చని.... చిరంజీవితో నాకు ఇప్పటికీ మంచి అనుబంధం ఉందని గిరిబాబు తెలిపారు.

చిరంజీవి కొదమసింహం విషయంలో గొడవ

చిరంజీవి కొదమసింహం విషయంలో గొడవ

చిరంజీవి నటించిన ‘కొదమసింహం', గిరిబాబు తీసిన ‘ఇంద్రజిత్' సినిమాల విషయంలో జరిగిన వివాదాస్పదన పరిణామాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కొదమసింహం, ఇంద్రజిత్ చిత్రాలు ఒకేసారి విడుదలకు సిద్ధమైన కౌబాయ్ సినిమాలు. ముందు ‘ఇంద్రజిత్' సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. తర్వాత నెల రోజులకు ‘కొదమసింహం' మూవీ విడుదలవ్వాల్సి ఉంది. అయితే రాత్రికి రాత్రే ‘కొదమసింహం' సినిమా రిలీజ్ ప్రకటించడం వివాదానికి దారి తీసింది.

వారు చేసిన పనికి నష్టపోవాల్సి వచ్చింది

వారు చేసిన పనికి నష్టపోవాల్సి వచ్చింది

మేం తీసిన ‘ఇంద్రజిత్' సెన్సార్ కోసం హైదరాబాద్ వచ్చింది. అపుడు ఆ సినిమా చూసిన కొందరు ‘కొదమసింహం' నిర్మాతలకు ఉప్పందించారు. మా సినిమా వస్తే ఆ సినిమా ఆడదనే భయంతో రాత్రి రాత్రే మా కంటే ముందే రిలీజ్ డేట్ ప్రకటించారు. అయితే కొదమసింహం బాక్సాఫీసు వద్ద సరిగా ఆడలేదు. అంత పెద్ద తారాగణం ఉన్న ఆ సినిమా ఆడకపోయే సరికి నేను తీసిన ‘ఇంద్రజిత్' కొనడానికి ఎవరూ ముందుకు రాలేదని గిరిబాబు తెలిపారు. మా సినిమా కూడా ప్లాపు ప్లాపు అని ప్రచారం చేశారు. తర్వాత రెండు నెలలకు ‘ఇంద్రజిత్' సినిమా విడుదల చేశాం... మేము అనుకున్న రేటుకుంటే సగం ధరకే సినిమాను అమ్మి నష్టపోవాల్సి వచ్చిందని గిరిబాబు తెలిపారు.

పవన్ కళ్యాణ్ గురించి గిరి బాబు

పవన్ కళ్యాణ్ గురించి గిరి బాబు

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ...ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం రాలేదు, అందుకు కారణం ఆ సినిమాల్లో నేను చేయాల్సిన పాత్రలు లేక పోవడమో? నాకు సూటయ్యే పాత్రలు లేకపోవడమో? అయి ఉంటుంది. త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా సెట్స్ కు ఇటీవల వెళ్లాను. మా మనవడు సినిమాపై అవగాహన కోసం ఆ సినిమాకు పని చేస్తున్నాడు. నేను వెళ్లగానే పవన్ కళ్యాణ్ లేచి వచ్చి పలకరించారు. మనిద్దరం కలిసి ఇప్పటి వరకు సినిమా చేయలేదే అని ఆయనే స్వయంగా అడిగారు. వెంటనే త్రివిక్రమ్‌ను పిలిచి మన సినిమాలో ఏదైనా పాత్ర ఉందా అని అడిగారు. నాకు సరిపోయే పాత్ర లేదని త్రివిక్రమ్ చెప్పారు. నాతో చేయాలని పవన్ కళ్యాణ్ కూడా ఉంది. భవిష్యత్తులో అవకాశం ఉంటే చేస్తాం.... అని గిరిబాబు తెలిపారు.

ఒకరిని తక్కువ చేయడం, ఎక్కువ చేయడం కాదు

ఒకరిని తక్కువ చేయడం, ఎక్కువ చేయడం కాదు

పవన్ కళ్యాణ్ పెద్దల పట్ల రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి. మంచి ఆర్టిస్ట్, జెంటిల్ బాయ్. మనకు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి వారు రేసుగుర్రాల్లా దూసుకెలుతున్నారు. వీళ్లలో ఒకరు ముందు వెనక అని కాదు.... అని గిరిబాబు అభిప్రాయ పడ్డారు.

జనసేన పార్టీ గురించి

జనసేన పార్టీ గురించి

పవన్ కళ్యాణ్ మంచి ఆశయాలు ఉన్న వ్యక్తి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వల్లనే తెలుగు దేశం పార్టీ గెలిచింది. త్వరలో జనసేన పార్టీని దించుతా అంటున్నాడు. ఏం జరుగబోతోంది అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. వెయిట్ అండ్ సీ అని కామెంట్ చేశారు గిరిబాబు.

English summary
Veteran Tollywood actor Giri Babu hot comments about NTR, ANR, Chiranjeevi and Pawan Kalyan. Giribabu said that rivalry had existed between NT Rama Rao, Akkineni Nageswara Rao and Krishna due to die hard fans. He stated that NTR and ANR had differences over shifting of Telugu film industry from Chennai to Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu