»   » గ్లామర్ కే పరిమితం కాదు: నయనతార

గ్లామర్ కే పరిమితం కాదు: నయనతార

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం ప్రభుదేవాతో ప్రేమాయణం సాగిస్తూ రోజుకో వార్తతో వార్తల్లోకి వస్తుంది మన కేరళ కుట్టి నయనతార. ఇటీవల వీరిద్దరూ పెళ్శి చేసుకోబోతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాకుండా ఇటీవల అజిత్, నయనతార జంటగా నటించిన తమిళ చిత్రం 'ఏగన్" ని ఇటీవల కేరళలో విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ లో నయనతార చాలా సెక్సీగా ఉండటం కొంతమంది కేరళీయుల మనోభావాలను దెబ్బతీసిందని నాగరాజ్ అనే వ్యక్తి ఈ చిత్ర దర్శకుడు రాజుసుందరం, నయనతారలపై కేసు పెట్టాడడం జరిగింది.

వీటితో పాటు ఆర్య, నయనతార హీరో, హీరోయిన్ లుగా తమిళంలో రూపోందించిన బాస్ ఎన్ గిర భాస్కరన్ చిత్రం ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. ఈ సినిమాని అంతా వినోదం ప్రధానంగా తెరకెక్కించడం జరిగింది. దానితో తమిళనాడుకి చెందిన కొందరు రాజకీయప్రముఖులు ఈ సినిమాని చూడడం జరిగింది. ఈ సినిమా చూసినంత సేపు వాళ్శు నవ్వుతూనే ఉన్నారని సమాచారం. గ్లామర్ పాత్రలకు పరిమితమైన నయనతార కూడా ఈ విధంగా తాను కామెడీ చేస్తుందని తాము ఊహించలేకపోయామని వారు వివరించారు. ఈ సినిమాలో ఆమె నటించిన లేదు, ఆ క్యారెక్టర్ లో జీవించిందని సదరు ఆ సినిమాని చూసిన రాజకీయనాయకులు వెల్లడించారు. తమిళంలో ఈ సినిమా ప్రస్తుతం బాక్సాపీస్ రికార్డులు బద్దలు కోడుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఇదే సినిమాని తెలుగులో నేనే అంబాని అనే పేరుతో రీమేక్ చేయడం జరగిందన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu