గోవా బ్యూటి ఇలియానా తో వెంకటేష్ రొమాన్స్....
గోవా బ్యూటీ ఇలియానా దూకుడు ఈమధ్య టాలీవుడ్ లో తగ్గినట్టు అనిపించినా, ఇప్పుడు మళ్ళీ ఊపందుకుంటోంది. ప్రస్తుతం యన్టీఆర్ తో 'శక్తి', శంకర్ తో '3 ఈడి యేట్స్' సినిమాలు చేస్తున్న ఇలియానా తాజాగా వెంకటేష్ తో కూడా ఓ చిత్రాన్ని యాక్సప్ట్ చేసింది. వెంకీ తో ఇది ఆమెకు తొలి చిత్రం అవుతుంది. ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ నటించే తాజా చిత్రంలో ఆ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించనుంది.
అల్లు అర్జున్ 'వరుడు" సినిమా ప్రొడ్యుసర్ డి.వి.వి.దానయ్య ఈ సినిమాని నిర్మిస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. గతంలో వెంకీ నటించిన 'నువ్వు నాకు నచ్చావ్', 'వాసు', 'మల్లీశ్వరీ' సినిమాలకు త్రివిక్రమ్ డైలాగులు రాసాడు. త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ లో వెంకటేష్ కి మరో విక్టరీ సాధిస్తాడని ఆశిద్దాం.
ఇలియానా వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ శక్తి డివివి దానయ్య ileana venkatesh trivikram srinivas dvv danayya


Click it and Unblock the Notifications