»   » 4 రోజుల్లో రూ. 100 కోట్లు..., ఆ సినిమా చూడొద్దంటున్న పోలీస్ బాస్!

4 రోజుల్లో రూ. 100 కోట్లు..., ఆ సినిమా చూడొద్దంటున్న పోలీస్ బాస్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కరణ్ జోహార్ దర్శకత్వంలో రణబీర్ కపూర్, ఐశ్వర్యరాయ్, అనుష్క శర్మ, పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'యే దిల్ హై ముష్కిల్'. పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన నేపథ్యంలో ఈ సినిమా నిషేదించాలనే వివాదం హాట్ టాపిక్ అయింది.

మొత్తానికి కరణ్ జోహార్ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి ఈ సినిమాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా విడుదల చేయడంలో సక్సెస్ అయ్యాడు. విడుదల తొలిరోజే 'యే దిల్‌ హై ముష్కిల్‌' బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ టాక్ తెచ్చుకుంది.

నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది. భారత్‌లో ఈ చిత్రం రూ.76 కోట్లకు పైగా వసూలు చేయగా ఓవర్‌సీస్‌లో 6.55 మిలియన్‌ డాలర్ల వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.121.21 కోట్ల బిజినెస్‌ చేసి 2016లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఆరో చిత్రంగా నిలిచినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ వెల్లడించింది.

కాగా... ఇపుడు ఈ సినిమాపై గోవా రాష్ట్ర పోలీస్ బాస్(డీజీపీ) చేసిన కామెంట్స్ సినిమాను మరోసారి వివాదంలో పడేసాయి.

సినిమాను బహిష్కిరించాలని డిజీపీ పిలుపు

గోవా డీజీపీ ముక్తేశ్‌ చందర్‌ గాయకుడు మహ్మద్‌ రఫీ అభిమానులు ఈ సినిమాను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు. సినిమాలో అలనాటి గాయకుడు మహ్మద్‌ రఫీని, ఆయన పాటలను అవమానపరిచారని, ఆయన అభిమానులంతా సినిమాను బహిష్కరించాలని డీజీపీ ట్వీట్‌ చేశారు.

 కారణం ఇదే..

కారణం ఇదే..

సినిమాలో అనుష్క, రణ్‌బీర్‌ల మధ్య జరిగే ఓ సీన్లో ‘మహ్మద్‌ రఫీ.. ఆయన పాడటం తక్కువ. ఏడ్వటం ఎక్కువ కదా?' అంటూ ఓ డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ మహ్మద్ రఫీ అభిమానుల మనసును గాయపరిచింది.

 పాక్ నటుల వివాదం

పాక్ నటుల వివాదం

ఉరీ ఘటన నేపథ్యంలో పాక్‌ నటులు భారత్‌ వదిలి వెళ్లిపోవాలని, వారి సినిమాలను భారత్‌లో విడుదల చేయనివ్వమని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన సినిమా విడుదల ముందు వార్నింగ్ ఇచ్చింది. దీంతో నిర్మాతల సంఘం హోంమంత్రి రాజ్‌నాథ్‌ను కలిసిచర్చించడంతో పాటు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్‌, ఎం.ఎన్‌.ఎస్‌ నేతలతో చర్చించింది.

 రూ. 5 కోట్ల డీల్?

రూ. 5 కోట్ల డీల్?

యే దిల్ హై ముష్కిల్ మూవీతో పాటు, ఇకపై ఏ సినిమాలో పాక్ నటులు నటించినా రూ.5 కోట్లు జవాన్ల కుటుంబ సంక్షేమ నిధికి ఇవ్వాలని నిర్మాతలతో జరిగిన చర్చల్లో ఎం.ఎన్‌.ఎస్‌ డిమాండ్‌ చేసింది. దీనికి నిర్మాతల సంఘం ఒప్పుకోవడంతో యే దిల్ హై ముష్కిల్ మూవీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా రిలీజైనట్లు స్పష్టమవుతోంది.

English summary
Goa's Director General of Police Muktesh Chander has appealed people to boycott Karan Johar's latest film "Ae Dil Hai Mushkil" for allegedly insulting legendary playback singer Mohammad Rafi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu