»   » అరటిపండు అవార్డ్స్: చెత్త హీరో, చెత్త హీరోయిన్స్ వీరే..

అరటిపండు అవార్డ్స్: చెత్త హీరో, చెత్త హీరోయిన్స్ వీరే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా ఇండస్ట్రీలో అవార్డులకు కొరత ఉండదు. బెస్ట్ డైరెక్టర్.. బెస్ట్ హీరో.. బెస్ట్ హీరోయిన్.. బెస్ట్ కమెడియన్.. ఇలా బెస్ట్.. బెస్ట్.. బెస్ట్.. బెస్ట్ అంటూ అన్ని కేటగిరిల్లో అవార్డులు ఇవ్వడం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇదే విధంగా చెత్త పెర్ఫార్మెన్స్ కనబరిచిన వారికి కూడా మన దేశంలో ప్రత్యేకంగా అవార్డుల కార్యక్రమం ఉంది. ‘గోల్డెన్ కేలా అవార్డ్స్' పేరుతో ప్రతి సంవత్సరం వీటిని ప్రకటిస్తున్నారు.

2009లో జతిన్ వర్మ ఈ ‘గోల్డెన్ కేలా' అవార్డులను తెరపైకి తెచ్చారు. ప్రతి ఏటా ఈ చెత్త అవార్డులకు నామినేషన్స్ తీసుకుంటారు. ఈ వేడుకలో.. వరస్ట్ అవార్డు గోస్ టూ అంటూ .. గోల్డెన్ కేలా అవార్డును అనౌన్స్ చేస్తారు. ఈ ఇయర్ కూడా గోల్డెన్ కేలా అవార్డుకు అన్ని విభాగాల్లో నామినేషన్లు పూర్తయ్యాయి. ఈ సంవత్సరం చెత్త పెర్ఫార్మెన్స్‌తో అవార్డులు అందుకున్న వారి వివారాలు ఇలా ఉన్నాయి.

 Golden Kela Awards 2015


వరస్ట్ యాక్టర్: అర్జున్ కపూర్ "గుండే"

వరస్ట్ హీరోయిన్ : సోనాక్షి సిన్హా (యాక్షన్ జాక్షన్, లింగా, హాలిడే)

వరస్ట్ ఫిల్మ్: హమ్ షకల్స్

వరస్ట్ డైరెక్టర్: ప్రభుదేవా "యాక్షన్ జాక్షన్"

వరస్ట్ తెరంగ్రేటం: టైగర్ ష్రాఫ్ (హీరో పంతి)

ఇరిటేటింగ్ సాంగ్: బ్లూ హై పానీ పానీ "యారియాన్"

చాలు బాబూ చాలా ఎక్కువైంది అవార్డ్: యో యో హనీ సింగ్

వరస్ట్ లిరిక్స్: షబ్బీర్ అహ్మద్ "ఐస్ క్రీమ్"... "ది ఎక్స్ ఫోజ్ మూవీ"

వరస్ట్ సీక్వెల్ లేదా రీమేక్: హృతిక్ రోషన్ నటించిన "బ్యాంగ్ బ్యాంగ్"

ఇంకా ఎందుకు ప్రయత్నిస్తున్నావు? అవార్డు: సోనామ్ కపూర్

అర్థం పర్థం లేని వివాదాస్పద మూవీ: "పికె"

జద్దూ అవార్డు: హ్యాపీ న్యూఇయర్ చిత్రంలో ఏలియాన్ పాత్ర చేసిన షారుక్ ఖాన్ అందుకున్నారు.

దారా సింగ్ అవార్డ్ ఫర్ వరస్ట్ అసెంట్: ప్రయాంక చోప్రా (మేరీ కోమ్)

కూనీ డ్రాకులా అవార్డ్: "6-5=2" మూవీ

English summary
Golden Kela Awards, which honours the worst of Bollywood, has revealed the list of this year's winners. The award show, which is an Indian version of Hollywood's Golden Raspberry Awards, presented the seventh edition this year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu